Перейти к содержимому

"కిన్నెరసాని" కావ్యంలో కథ | Kinnerasani | Viswnatha Satyanarayana | Rajan PTSK

Ajagava

0:00 / 0:00

"కిన్నెరసాని" కావ్యంలో కథ | Kinnerasani | Viswnatha Satyanarayana | Rajan PTSK

65 369 просмотров · 2 года назад
Ajagava
188 тыс. подписчиков
65 369 просмотров · 2 года назад
తెలుగు సాహిత్యంలోనే అద్భుత గేయకావ్యం కిన్నెరసాని కథ “విశ్వనాథ వారి కవిత్వం మహాబలిపురం రాతిరథాల వంటిది. తాను కదలకుండా మనల్ని కదిలిస్తుంది” అన్నారు శ్రీశ్రీ. కవిసమ్రాట్ గురించి మహాకవి చెప్పిన ఉపమానమిది. విశ్వనాథవారు తెలుగు కవుల్లో హిమాలయం వంటివారు. ఆయన ప్రతీ రచనా దేనికదే గొప్పది. అయితే వారి కొన్ని రచనలు మాత్రం పాఠకులతో పాటూ మహాకవుల్ని కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అటువంటి రచనల్లో ఒకటి.. “కిన్నెరసాని” అనే గేయకావ్యం. ఈ కిన్నెరసాని అనేది గోదావరికి ఉపనది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోను ప్రవహిస్తుంది. విశ్వనాథవారు తన చిన్నతనంలో అంటే ఇప్పటికి సుమారు 100, 110 సంవత్సరాల క్రితం అడవుల గుండా పరుగులు తీసే ఈ కిన్నెరసానిని చూసి మైమరచిపోతుండేవారు. మామూలు వ్యక్తులైతే తమకు నచ్చిన వాటిని, తాము మెచ్చినవాటినీ చూసి ఆనందించి ఊరుకుంటారు. కానీ మహాకవులు అలా కాదుగా. వారికి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా ఆ భావాలన్నీ కవిత్వంగానే పొంగుతాయి. ఆ కోవలోనే విశ్వనాథవారు చేసిన చమత్కారం ఈ కిన్నెరసాని గేయ కావ్యం. ఈ కిన్నెరసాని నది ఎలా పుట్టిందో, అది గోదావరికి ఉపనది ఎలా అయ్యిందో అద్భుతమైన ఓ కల్పన చేసి, కరుణ రసభరితంగా గేయ రచన చేశారు విశ్వనాథ.