అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*
v v w news
0:00 / 0:00
అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన*
31 просмотр · 10 часов назад
v v w news
32,3 тыс. подписчиков
31 просмотр · 10 часов назад
అప్పర్ రాంజీ ఎస్టేట్‌లో ఘనంగా వినాయక చవితి అన్నసమారాధన
నగరంలోని 47వ వార్డు పరిధి అప్పర్ రాంజీ ఎస్టేట్ గ్రామంలో '30+ యూత్' ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలను పురస్కరించుకుని భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 47వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు గునుపూడి అరుణ ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా జరుపుకునే ఏకైక పండుగ వినాయక చవితి అని కొనియాడారు. సకల దానాల్లో కల్లా అన్నదానం ఎంతో పుణ్యప్రదమైనదని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ అన్నసమారాధనకు స్థానికులు, భక్తులు దాదాపు 1000 మందికి పైగా హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కప్పరాడ మండల బీజేపీ అధ్యక్షుడు గునుపూడి అరుణ్ బాబు (ఆర్య), టీడీపీ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి మహేష్, రాంజీ ఎస్టేట్ గ్రామ సేవా సంఘం అధ్యక్షుడు యలమంచిలి ప్రసాద్, జనసేన వార్డు ఇంచార్జ్ ధవళ ఫణీంద్రతో పాటు '30+ యూత్' ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.