Перейти к содержимому

జనసేన పార్టీ శ్వాస వెన్నెముక యువత

వార్తా వాహిని

0:00 / 0:00

జనసేన పార్టీ శ్వాస వెన్నెముక యువత

4 774 просмотра · 12 дней назад
వార్తా వాహిని
28 подписчиков
4 774 просмотра · 12 дней назад
జనసేన పార్టీ శ్వాస వెన్నెముక యువత స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేనకు కేటాయించే ప్రతి సీటు గెలవాలి పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని ఎవరూ విస్మరించకూడదు -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు అవనిగడ్డలో కదం తొక్కిన వేలాదిమంది జనసైనికులు, వీరమహిళలు అవనిగడ్డ: జనసేన పార్టీ శ్వాస వెన్నెముక యువత అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, వెంకట్రామ్, పార్టీ నాయకులు పూజలు చేశారు. ఆలయం వద్ధ నుంచి అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల నుంచి తరలివచ్చిన వందలాది మంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు యువనేత మండలి వెంకట్రామ్ నాయకత్వంలో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ యువత వెంట నడిచి వారిలో ఉత్సాహం నింపారు. వంతెన సెంటరులో సింహాద్రి పవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. గాంధీ క్షేత్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కేకును ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, వెంకట్రామ్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఆవిర్భావ సభ లైవ్ తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆలోచనలు యువతపైనే ఉన్నాయన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని యువశక్తి జనసేన పార్టీకి ఉందన్నారు. యువతను ముందుకు నడిపే ధృక్పధంతో పవన్ కళ్యాణ్ జనసేన యువజన విభాగం ప్రకటించారన్నారు. జనసేనాని ప్రకటించిన కార్యాచరణను భవిష్యత్తులో సంపూర్ణముగా నెరవేర్చేలా యువత శపథం తీసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్మోహనరెడ్డి దుర్మార్గ పరిపాలనను ఎదిరించిన మహా వీరుడు పవన్ కళ్యాణ్ నాటి వైసీపీ అభివృద్ధి నిరోధక పాలనను సాగనంపటానికి టీడీపీతో జతకట్టి బీజేపీని ఒప్పించి కూటమి ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు, రాష్ట్రం ప్రగతి బాటలో పయనించేందుకు కూటమి ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ కృషి, సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీ 21సీట్లకు తగ్గటంతోనే రాక్షస సంహారం జరిగి, కూటమి ప్రభుత్వ ఆవిర్భావంలో పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని ఎవరూ విస్మరించకూడదని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేనకు కేటాయించి ప్రతి సీటు గెలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న స్ఫూర్తితో ఇదే దీక్షతో ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, యువనేత మండలి వెంకట్రామ్ కృషి ప్రశంసనీయం అన్నారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. యువత మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అత్యధిక ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. జనసేన పార్టీలో పనిచేస్తున్న యువత ప్రతి ఒక్కరు ఈ దిశగా ఆలోచించి స్థానిక సంస్థల్లో ఘన విజయాలే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఘంటసాల మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సుగ్గున పవన్ కుమార్ ఆధ్వర్యంలో 50మంది ఎస్టీలకు దుప్పట్లు పంచిపెట్టారు. కోడూరు మండల పార్టీ ఆధ్వర్యంలో వంద మంది నిరుపేద ఎస్టీలకు నూతన వస్త్రాలు దానం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల మండలాల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, పూషడపు రత్నగోపాల్, మర్రె గంగయ్య, చోడగం విమల్ కృష్ణ, కోన రాజశేఖర్, సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాధ్ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు కొండవీటి సునీత, గాజుల శంకరరావు, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్, లంకె భాస్కరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, కోడూరు టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్లు బొందలపాటి వీరబాబు, కోట సుబ్బారావు, యలవర్తి చిన్నా, యర్రంశెట్టి సుబ్బారావు, అరజా రాధిక, పూతబోయిన కరుణ కుమార్, లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ కొండవీటి శివరాం, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, నీటి సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, దేవస్థానం డైరెక్టర్లు, జనసేన పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత లంకమ్మ మాన్యంలో జనసేన పార్టీ లంకమ్మ మాన్యం యువత ఆధ్వర్యంలో ఎంపీపీ స్కూల్లో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మొక్కలు నాటారు. జనసేన పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి పంచిపెట్టారు.