Перейти к содержимому

శ్రీ చండీ నవశతీ - బ్రహ్మశ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

Navasathi

0:00 / 0:00

శ్రీ చండీ నవశతీ - బ్రహ్మశ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

10 572 просмотра · 4 дня назад
Navasathi
1,04 тыс. подписчиков
10 572 просмотра · 4 дня назад
శ్రీ దేవీమహాత్య్మమ్ శ్రీ చండీ నవశతీ మంత్రమాలా శ్రీ మార్కండేయ మహాపురాణాంతర్గతము శ్రీ గోపానంద నాథులు బ్రహ్మశ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు - శ్రీ చండీ నవశతీ మంత్రమాలా గ్రంథ వివరణ https://www.navasathi.com/expert-opin... !!!! మహర్షుల దర్శనానికి నమస్సులు !!!! వేదాలలో వివిధ సందర్భాలలో కీర్తించబడిన దేవీ సూక్తాలను వేద వ్యాస మహర్షి మార్కండేయ పురాణంలో " శ్రీ దేవి మహాత్మ్యం" పేరుతో అందించారు. " ఇతిహాస వేదం సముపబృంహయేత్ "-అనునట్లు ఈ భాగములోని శ్లోకాలన్నీ వేదసూక్తాల స్వరూపాలే. అంతేకాక నిగమాగమ సమంవ్యంగా బీజాక్షర, మంత్రాక్షర గర్భితాలు. నిశితంగా పరిశీలిస్తే- ఈ గ్రంధం మనలోని రాజ స్తమోగుణమైన రాక్షస ప్రవృత్తిని నశింపజేసి, సత్వగుణాన్ని ప్రవృద్ధంజేసి పరదేవతానుగ్రహార్థం మహర్షిచే అనుగ్రహింపబడిన తత్వనిధి. ఇది బ్రహ్మ విద్య. అంటే- వేదాంత శాస్త్రం. అనగా - వేద ప్రతిపాదిత పరతత్వ నిరూపణే దీని పరమ ప్రయోజనం. సాత్విక తాత్విక రీతిలో దీనిని ఉపాసనకు వినియోగించిన వారికి అవాంతర ప్రయోజనాలుగా ఐహికాభీష్టసిద్ధి చేకూరడమే కాక, క్రమంగా చిత్తశుద్ధి , సుజ్ఞానసిద్ధి ముఖ్య ప్రయోజనాలుగా ప్రాప్తిస్తాయి. ఈ వైదిక సంప్రదాయాన్ని అనుసరించిన ఉపాసనను ప్రతిష్టించిన మహర్షి తుల్యులు శ్రీ శ్రీ శ్రీ గోపనందనాథులవారు. వారి దర్శన భాగ్యం, వారి వాత్సల్య సౌభాగ్యం అమ్మ దయవల్ల నాకు లభించిన వరాలు. వ్యాసదేవుడు ఈ గ్రంధాన్ని " దేవీ మాహాత్మ్యమ్ " అని స్పష్ఠంగా పేర్కొన్నారు. తరువాత దీనిని తాంత్రిక ప్రయోగభేదాలతో విభజించి వ్యాపింపచేశారు ఉపాసకులు. ఎవరి సంప్రదాయాలు ఎలా వున్నా, నవార్ణమంత్ర స్వరూపిణి ఐన పరదేవతను " నవశతీ"గా ఈ గ్రంధం ద్వారా ఆరాధించడం సత్సంప్రదాయమని నిరూపించిన గ్రంథమిది. ఇది వేద సంప్రదాయమైన ప్రబోధకంగా ఉంది. సాత్విక ధర్మానుయాయులకు సమర్ధనీయంగా కూర్చబడిన ఈ కూర్పులోని ఔచిచ్యం, ఉపాసనా సిద్ధులైన వీరికి స్ఫురించిన దైవీ సంకల్పం. ఈ గ్రంధాన్ని పరిశీలించి, పరవశించి పరదేవతను ప్రార్థించడం తప్ప-దీని గురించి వ్యాఖ్యానించి విశ్లేషించే ఉపజ్ఞగాని, ఉపాసనా లలంగానీ నాకు లేవు. సదాచార స్వరూపిణి, దురాచారసమనీ ఐన జగజ్జనని యొక్క దివ్యవాత్సల్యాన్ని ఈ సంప్రదాయానుగుణంగా పరిపూర్నంగా గ్రహించ వచ్చుననడంలో సందేహం లేదు. శాక్తేయ విద్యను తామసీ రాజసీ స్వరూపాలుగా కాక సాత్విక విద్యగా ఆరాధించడమే పరబ్రహ్మ ప్రాప్తి హేతువు. ఆదిశంకరాచార్యులు ఈ మార్గాన్నే సుష్టుపరచారు. అటువంటి పావన మార్గాన "శ్రీ చండీ నవశతీ మంత్ర మాల" నవాంగ సహితముగా ఆవిష్కరించి, పరదేవతాఅనుగ్రహ కాంక్షలైనవారికి ధన్యులను చేశారు శ్రీ గోపానంద నాథుల వారు. కైవల్య సిద్ధి పొందిన ఈ మహనీయుని సదాశయాన్ని ప్రసరింపజేస్తూ, ఈ గ్రంధాన్ని వెలువరించిన వారి వారసులు ధన్యులు. ఈ దివ్య గ్రంధములో నా ఈ మాట ద్వారా పరదేవతను అర్పించుకొనే భాగ్యము కల్పించినందుకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటూ . శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ. 25-08-2004