Перейти к содержимому

Chivari Chupu |Most Emotional NannaTelugu Song|Heart Touching Nanna Song|Telugu nanna Sad song|

మధుర గీతం (Madhura Gitam) Pure Music

0:00 / 0:00

Chivari Chupu |Most Emotional NannaTelugu Song|Heart Touching Nanna Song|Telugu nanna Sad song|

3 642 просмотра · 7 мес. назад
మధుర గీతం (Madhura Gitam) Pure Music
4,17 тыс. подписчиков
3 642 просмотра · 7 мес. назад
నాన్న ప్రేమకు సమానం ఈ లోకంలో ఇంకేమీ లేదు. తండ్రి కోసం ఏడిచే ప్రతి కొడుకి హృదయాన్ని తాకే భావోద్వేగ గీతం ఇది. 🎵 పాట: దండాలో… మీకు దండాలు 📺 ఛానల్: MADHURA GITAM ఈ పాటలో తండ్రి ప్రేమ, జ్ఞాపకాలు, మరియు చివరి ప్రయాణం గురించి హృదయాన్ని కదిలించే భావాలు ఉన్నాయి. తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం. మీకు ఈ పాట నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి, Channel Subscribe చేయండి. #NannaSong #FatherSong #EmotionalSong #TeluguSong #SadSong #FatherLove #TeluguFolkSong #HeartTouchingSong #EmotionalTeluguSong #MADHURAGITAM Song lyrics..L v Srinivas music.. AI video editing..ycut song name.. దండాలు full Lyrics ✨ ************* దండాలో..... మీకు దండాలు అయ్యలారా...అన్నలారా... దండాలో.... మీకు దండాలు.. పాడే మోసే సేతులకు దండాలు… నా పాడే మోసే అన్నదమ్ములకు దండాలు… ఓ కొడుకా… నా పాడేకు నిప్పు పెట్టే కొడుకా నీకు నా చేతులెత్తి దండాలు… దండాలు… దండాలు… సివరి శ్వాసతో దండాలు… శవమై పోతున్నా పాటనై మీ గుండెల్లో మిగిలే దండాలు… ఓ కాటికాపరి అన్నా నీకు దండాలు… నన్ను బూడిద సేసినందుకు దండాలు… తులసి నీరు పోసిన అందరికీ దండాలు నా జీవితం సుట్టూవున్నా జ్ఞాపకాలు… మంటలో కలిసిపోయే..మీ గుండెలో నిలిసిపోయే ఈ లోకం నుండి పంపిన పంతులయ్యో నీకు శతకోటి దండాలు… పుణ్యలోకానికి దారి సూపిన యమరాజా నీకూ దండాలు… నన్ను తీసుకెళ్లే ఆ నాలుగు భుజాలే నా జీవిత సత్యం రా… పుట్టినప్పుడే మోసిన సేతులే చివరికి నా పాడే మోసిన భుజాలు దండాలు… సేతులెత్తి దండాలు… జీవితానికే నా దండాలు… బూడిదై ఎగిరినా గాలిలో మీ ఊపిరిలో నేనే ఉంటా… ప్రేమలు పంచిన అన్నదమ్ములారా మీ అనురాగానికి దండాలు… అక్కసెల్లెళ్ల అనురాగానికి నా గుండె నిండా దండాలు… జీవితమే ఇచ్చిన ఆలికి… నిన్నే ఎట్టా మరిసిపోతునే… వదిలి వదలలేక పోతున్నా నే… నీ కళ్లలో నీడగా నిలిసిపోతానే… నా గుండె సప్పుడు నీవే కదా… పసికూన పిల్లవు… నా శ్వాస నీవే… నేను లేక ఎట్టా బతుకుతావో ఆలోచన నన్ను సంపుతుంది రా… సితిలో కాలుతున్న శరీరమే పాటగా మారి ఎగిరిపోతుంది… బూడిదై నేలలో కలిసినా జ్ఞాపకాలై మిగిలిపోతుంది… ఇంటి గోడపై నా బొమ్మ మీ గుండెలో నిలిచే నా ప్రేమ మన ఇంటి సంతోషం లో నా నీడ దాగి ఉంటుంది… ఆకలి వేస్తే కాకిలా వచ్చి సుట్టంలా పలకరించి పొతా.. దండాలో… దండాలు… ఈ జన్మకే దండాలు… బతికిన ప్రతి క్షణానికి నా శతకోటి దండాలు… శవమై పోతున్నా పాటనై మీ మనసులో ఉండిపోతా… కన్నీటి సుక్కనై జారినా జ్ఞాపకంగా మారిపోతా… పాడే మోసే సేతులకు దండాలు… నా పాడే మోసే అన్నదమ్ములకు సివరి సూపు సూసిన సివరి సారి చేతులెత్తి నా జీవితానికే దండాలు… అందరికీ దండాలు.. దండాలో..... మీకు దండాలు అయ్యలారా...అన్నలారా... దండాలో.... మీకు దండాలు..