#malladivenkatakrishnamurthy | శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి | ఫ్యామిలీ ఆల్బమ్ | ఫుడ్ అండ్ ఫేమిలీ |
Yuva Telugu Magzine
0:00 / 0:00
#malladivenkatakrishnamurthy | శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి | ఫ్యామిలీ ఆల్బమ్ | ఫుడ్ అండ్ ఫేమిలీ |
4 348 просмотров · 6 л. назад
Yuva Telugu Magzine
6 тыс. подписчиков
4 348 просмотров · 6 л. назад
అభిమాన రచయిత శ్రీ మల్లాది గారి అపురూప జ్ఞాపకాల శీర్షిక "ఫ్యామిలీ ఆల్బుమ్" లో వారి ఆహార అభిరుచులు గురించి "ఫుడ్ అండ్ ఫేమిలీ" శీర్షికన తెలియచేస్తున్నారు.
ఈ శీర్షిక గురించి మల్లాది గారి మాటల్లో...
"సగటు మధ్యతరగతి తెలుగు వారి కుటుంబాల్లో జరిగే అనేక సంఘటనలని మీరు ఈ శీర్షికలో వింటారు.
అవన్నీ మీ జీవితాల్లో ఈ పాటికే జరిగి ఉండవచ్చు. వాటిలో కొన్ని ఆర్ద్రం గా, కొన్ని హాస్యం గా, కొన్ని సెంటిమెంట్ గా, కొన్ని ఆలోచించేవిగా ఉంటాయి.
ఏతావాతా ఇవన్నీ దాదాపు మీ జీవిత పరిధికి చెందినవే.
మీ గురించే ఇంకెవరో రాసింది చదువుతున్నారని మీకు బహుశా అనిపించక మానదు.
---మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు.
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రచయితగా పరిచయం చెయ్యవలసిన అవసరం లేని పేరు. తెలుగులో పాపులర్ రచయితల పేర్లు చెప్పమంటే మొదటి క్షణంలో స్ఫురించె పేర్లలో ఒకటి. అర్థ శతాబ్దానికి పైగా రచనలు చేస్తూ....తన రచనా శైలి , సంవిధానాలతో పాఠకుల్ని కట్టిపడేసే రచయిత. నూటయాభైకి పైగా నవలలు...చిన్నా పెద్దా కథలు వేల సంఖ్యలో నిరంతరాయంగా రాస్తున్న రచయిత.కథలు...నవలలు మాత్రమే కాదు....జోక్స్...పిల్లల పేర్ల పుస్తకాలు.... అన్నిటికన్నా గొప్పగా...యాత్రా సాహితి...ప్రపంచ దేశాలు అన్ని తిరిగి చూసి అక్కడి అరుదైన వింతలు విశేషాలు కళ్ళకు కట్టినట్లు చేప్పిన రచయిత. తన కథల్లో నవలల్లో పాత్రలకు చిత్రమైన పేర్లు పెడతారు.ప్రతి కథా నవలా పాఠకుడికి ఏదో ఒక కొత్త విషయం పరిచయం చేస్తుంది.ఒక్కోసారి ఆ విషయంగురించి ఏమీ తెలీనివాళ్ళు కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయిన ఫీలింగ్ కలిగిస్తారు. ఆయన రచనలు కొంత జనరల్ నాలెడ్జిని కూడా పెంచుతాయి. రచనని సాదా సీదా భాషలో సాగిస్తూ...వేగంగా చదివించే గుణం ఉన్న రచనలు వారివి.తెలుగు రాష్ట్రాలలో వివిధ వర్గాల పాఠకులకి వారి రచనలు చదవడం ఒక ఇష్టంగా...అలవాటుగా...వ్యసనంగా ....మార్చేసిన రచయిత అంటే అతిశయోక్తి కాదు. రచనకి సబిజెక్టు ఎంచుకోడంలో గొప్ప వైవిధ్యం చూపించే రచయిత. ఆయన రచనలు ప్రచురితం
కానీ పత్రికలు లేవు...అన్ని ప్రింట్...ఎలెక్ట్రానిక్ మీడియాల్లోనూ ఆయన రచనలు విరివిగా వచ్చాయి.సినిమాలకు కథలు...స్క్రీన్ ప్లే...సంభాషణలు అందించారు.ఆధ్యాత్మిక కథలు... జెన్ కథలు రాసారు.