సంఘమయుగ ఓడవెళ్ళిపోతుంది,అందరినీ ఆహ్వానిస్తోంది(రచించి స్వరపరచినది) Shiva devotional song
Rudrageethi(రుద్రగీతి)
0:00 / 0:00
సంఘమయుగ ఓడవెళ్ళిపోతుంది,అందరినీ ఆహ్వానిస్తోంది(రచించి స్వరపరచినది) Shiva devotional song
7 781 просмотр · 10 дн. назад
Rudrageethi(రుద్రగీతి)
361 подписчик
7 781 просмотр · 10 дн. назад
ఓడెల్లి పోతున్నది మాబాబా ఓడెళ్ళిపోతున్నది
శివబాబా ఓడెల్లి పోతున్నది
ఓడెల్లి పోతున్నది మాబాబా ఓడెల్లి పోతున్నది
ప్రియబాబా ఓడెల్లి పోతున్నది
ఈశ్వరీయ పరివారము అంతా ఒకటిగ కలసి
ఈశ్వరీయ పరివారము అంతా ఒకటిగ కలసి
పరమాత్ముని గుణగణాలు ఈజగతికి చాటిచెప్పి
ఆత్మపరమాత్మల పరిచయాన్ని తెలుపుకుంటూ
సాగి ముందుకెళుతున్నది మాబాబా ఓడెల్లి పోతున్నది
శివబాబా ఓడెల్లి పోతున్నది.
ఓడెల్లి పోతున్నది మాబాబా ఓడెళ్ళిపోతున్నది
శివబాబా ఓడెల్లి పోతున్నది
మనమంతా ఆత్మలమని ఒకే తండ్రి బిడ్డలమని
అన్నాచెల్లెళ్ళమని అక్కాతమ్ముళ్లమని
ఈ దృష్టే సత్యయుగపు మహారాజుగ చేస్తుందని
చాటుకుంటూ వెళుతున్నది
మాబాబా ఒడెళ్ళిపోతున్నది,శివబాబా ఓడెళ్ళిపోతున్నది.
ఓడెల్లి పోతున్నది మాబాబా ఓడెళ్ళిపోతున్నది
శివబాబా ఓడెల్లి పోతున్నది
దైహిక చింతన వలదని,ఆత్మచింతనే బలమని
పదిమంది చింతనలో ఆత్మ పతనమౌతుందని
పరమాత్ముని చింతనలో పదమమంత భాగ్యమని
తెలుపుకుంటూ వెళుతున్నది
మాబాబా ఓడెళ్ళిపోతున్నది, శివబాబా ఓడెళ్ళిపోతున్నది.
ఓడెల్లి పోతున్నది మాబాబా ఓడెళ్ళిపోతున్నది
శివబాబా ఓడెల్లి పోతున్నది
రంగురంగుల లోకం,మాయమర్మపు లోకం
దీనిపైన మమకారం పెంచుకుంటే మహపాపం
ఆకర్షణ ముక్తులుగా ఐతే మనకంత భాగ్యం
ఆదమరచి పోమాకండి
మా తమ్ములార ఆలస్యం చేయొద్దండి
మా అన్నలార మీరుకూడా మాతో రండి
ఓడెల్లి పోతున్నది మాబాబా ఓడెళ్ళిపోతున్నది
శివబాబా ఓడెల్లి పోతున్నది
నేను,నాదన్నపుడే చిక్కుల్లో చిక్కేవు
ఇంటికి వెళ్ళే సమయం,బంధనాలు పెంచుకోకు
ఈ సత్యం తెలుసుకొని,పరివర్తనగా కమ్మని
బోధచేస్తూ వెలుతూ వుంది మాఅక్కలార
ఆగిసాగి వెళుతూవుంది
మా చెల్లెళ్ళర మీరుకూడ మాతో రండి.
ఓడెల్లి పోతున్నది మాబాబా ఓడెళ్ళిపోతున్నది
శివబాబా ఓడెల్లి పోతున్నది
ప్రియబాబా ఓడెల్లి పోతున్నది.