Перейти к содержимому

ఎటు పోతున్నావు? | Super Hit Song | సమాజ హిత గీతిక | Social Reformation Song | Agape TV | ఆశిశ్రీ

AGAPE TV అగాపే టివి

0:00 / 0:00

ఎటు పోతున్నావు? | Super Hit Song | సమాజ హిత గీతిక | Social Reformation Song | Agape TV | ఆశిశ్రీ

370 просмотров · 10 дн. назад
AGAPE TV అగాపే టివి
234 подписчика
370 просмотров · 10 дн. назад
🎵 *అమ్మాయీ, అబ్బాయీ… ఎటు పోతున్నావు?* మనిషి జీవితంలో ప్రతి నిర్ణయం ఎంతో విలువైనది. తియ్యని మాటలను గుడ్డిగా నమ్మినా, పైకి కనిపించే రూపాన్ని చూసి మోసపోయినా, తప్పు స్నేహాల వెంట నడిచినా జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సామాజిక చైతన్య గీతం ప్రతి ఒక్కరికీ ఒక సందేశాన్ని అందిస్తుంది: 🔹 మాటలను మాత్రమే కాదు, చేతలను కూడా గమనించాలి. 🔹 చూసిందంతా నిజం కాదు; విన్నదంతా నమ్మకూడదు. 🔹 మోసపూరితమైన హామీలను జాగ్రత్తగా పరిశీలించాలి. 🔹 చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. 🔹 చిన్న తప్పు పెద్ద సమస్యగా మారకముందే అప్రమత్తం కావాలి. 🔹 ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తును అందంగా నిర్మించుకోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, సంబంధాలు, సామాజిక మాధ్యమాలు—జీవితంలోని ప్రతి రంగంలోనూ నిజానిజాలను పరిశీలించడం అవసరం. *ఆగు… ఆలోచించి… నీ దారి ఎంచుకో!* ఈ పాటలోని సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి సామాజిక చైతన్య గీతాల కోసం Agape TV ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను నొక్కండి. 🎬 సమర్పణ: విభిన్న ప్రతిభావంతుల సమూహమైన అగాపే టివి ✍️ సాహిత్యం, స్వరకల్పన, స్వరం : ఆశిశ్రీ 🎼 సంగీతం, గానం : కృమేసు 📺 *Agape TV — Love, Care, Empower* #ఎటుపోతున్నావు #సామాజికచైతన్యగీతం #AgapeTV గీతం శీర్షిక : “అమ్మాయీ... అబ్బాయీ... *************************** ఎటు పోతున్నావు? ” ************************* సాహిత్యం, స్వరకల్పన, స్వరం : ఆశిశ్రీ,  రచనా కాలం : 6 అక్టోబరు, 2026, మంగళవారం ఉ. గం. 7.00 ని.  వాక్య లేఖన మూలాధారం :  **************************** ☀️ - (ఎక్కడికి) ఎటు పోతున్నావు?  ఆదికాండము 16:8  ☀️ ఇదే త్రోవ దీనిలో నడువండి. యెషయా 30:21 గీతం శీర్షిక : ************ ఎటు పోతున్నావు?  ******************** పల్లవి : అమ్మాయీ, అబ్బాయీ ఎటు పోతున్నావు?  ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ ఎటు పోతున్నావు? పోయే దారి బాగోక పోతే  చిక్కులో పడతావు పోయే దారి బాగోక పోతే  ఇరుక్కుపోతావు చరణం - 1. మంచి వారమని మాయలుచేసే  మనుషులు ఉన్నారు  మాటనే మంచని ఎంచావంటే  మోసపోతావు మాటకు చేతకు పొంతన నీవు  ముందే పసికట్టాలి మాటకు చేతకు కుదరకపోతే  వెంటనే విడిచి పెట్టాలి  అమ్మాయీ, అబ్బాయీ ఎటు పోతున్నావు?  ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ ఎటు పోతున్నావు? పోయే దారి బాగోక పోతే  చిక్కులో పడతావు పోయే దారి బాగోక పోతే ఇరుక్కుపోతావు  చరణం - 2. తెల్లనివన్నీ పాలనుకొని  త్రాగబోవద్దు  రంగులు వేస్తే విషం కూడా  తెల్లగా ఉంటుంది  పయోముఖ విష కుంభాలు చుట్టూనే ఉన్నాయి  తెలివి కలిగి మెలగక పోతే తగలడిపోతావు అమ్మాయీ, అబ్బాయీ ఎటు పోతున్నావు?  ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ ఎటు పోతున్నావు? పోయే దారి బాగోక పోతే  చిక్కులో పడతావు పోయే దారి బాగోక పోతే ఇరుక్కుపోతావు  చరణం – 3 చూసినదంతా నిజమని నమ్మి మోసపోవద్దు విన్నదంతా వేదమనుకొని ఎగబడిపోవద్దు కన్నుల ముందు చూసేదంతా కానే కాదు నిజం నిజమేదో, అబద్ధమేదో తెలిసి మసులుకో అమ్మాయీ, అబ్బాయీ ఎటు పోతున్నావు? ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ ఎటు పోతున్నావు? పోయే దారి బాగోక పోతే చిక్కులో పడతావు పోయే దారి బాగోక పోతే ఇరుక్కుపోతావు చరణం – 4 చిన్న తప్పని మొదలు పెడితే పెద్దదై పోతుంది చెడు స్నేహం వెంట పడితే చెడిపోతావు కదా ఈరోజుటి నీ నిర్ణయం నిర్మిస్తుంది రేపటిని ఆలోచించి అడుగేస్తే జీవితమంతా అందమే అమ్మాయీ, అబ్బాయీ ఎటు పోతున్నావు? ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ ఎటు పోతున్నావు? పోయే దారి బాగోక పోతే చిక్కులో పడతావు పోయే దారి బాగోక పోతే ఇరుక్కుపోతావు  5. తప్పు నిర్ణయం తీసుకుంటే  జీవితమంతా వేదనే  చేతులు కాలాక ఆకులు పడితే  ఉండదు ఎలాంటి లాభం క్షణమాత్రపు నీ నిర్లక్ష్యానికి  బ్రతుకే బద్దలౌతుంది  మంచి నిర్ణయం చేస్తే  భవిత బంగారమౌతుంది  అమ్మాయీ, అబ్బాయీ ఎటు పోతున్నావు? ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ ఎటు పోతున్నావు? ఆగు…. ఆలోచించి…  నీ దారి… ఎంచుకో…  పోయే దారి బాగోక పోతే చిక్కులో పడతావు పోయే దారి బాగోక పోతే ఇరుక్కుపోతావు ఆగు…. ఆలోచించి…  నీ.. దారి… ఎంచుకో… ఆగు… ఆలోచించి…  నీ… దారి… ఎంచుకో…  © October, 2026 అగాపే టివి All Rights Reserved. ఈ వీడియోలోని: స్క్రిప్ట్, వాయిస్,విజువల్స్, ఐడియా, ఎడిటింగ్ స్టైల్, మ్యూజిక్ మా అనుమతి లేకుండా కాపీ చేయడం, భాగం తీసుకోవడం, డబ్ చేయడం, రీమేక్ చేయడం, కలిపి వాడడం, Re-Upload చేయడం కఠినంగా నిషేధం. Copyright Act 1957 & Digital Millennium Copyright Act (DMCA) ప్రకారం తక్షణం చర్యలు తీసుకోబడతాయి. #ఎటుపోతున్నావు #అమ్మాయీఅబ్బాయీ #సామాజికచైతన్యగీతం #సంఘసంస్కరణ #తెలుగుపాటలు #సామాజికసందేశం #జీవితపాఠాలు #మంచినిర్ణయాలు #TeluguSongs #TeluguSocialAwarenessSong #TeluguMotivationalSong #AgapeTV #Ashisri #Krimesu