Перейти к содержимому

మా ఇంటి స్టైల్‌లో రుచికరమైన పెసరపప్పు చారు కుక్కర్‌లో ఈజీగా పెసరపప్పు చారు | Simple & Tasty Recipe

Meenakshi Home's kitchen

0:00 / 0:00

మా ఇంటి స్టైల్‌లో రుచికరమైన పెసరపప్పు చారు కుక్కర్‌లో ఈజీగా పెసరపప్పు చారు | Simple & Tasty Recipe

135 просмотров · 3 нед. назад
Meenakshi Home's kitchen
87 подписчиков
135 просмотров · 3 нед. назад
పెసరపప్పు – 2 కప్పులు నూనె – తగినంత ఆవాలు – కొద్దిగా జీలకర్ర – కొద్దిగా ఎండుమిరపకాయలు – తగినన్ని ఉల్లిపాయలు – తగినన్ని టమాటాలు – తగినన్ని పచ్చిమిర్చి – తగినన్ని కరివేపాకు – కొద్దిగా పసుపు – కొద్దిగా కారం – రుచికి సరిపడా ఉప్పు – రుచికి సరిపడా నీళ్లు – అవసరమైనంత ముందుగా రెండు కప్పుల పెసరపప్పును కడిగి, కొద్దిగా నీళ్లు వేసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆపై టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పును మెత్తగా మెదిపి ఈ పోపులో కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. చివరగా రెండు గ్లాసుల నీళ్లు పోసి, పప్పు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు మరిగించాలి. అంతే! ఎంతో రుచికరమైన పెసరపప్పు రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. 😋