మనుషులు మాయం అయితే ఏం చెయ్యాలి? గీత రచన ఆచార్య రాణి సదాశివ మూర్తి
Rani Sadasiva Murty
0:00 / 0:00
మనుషులు మాయం అయితే ఏం చెయ్యాలి? గీత రచన ఆచార్య రాణి సదాశివ మూర్తి
117 просмотров · 9 дней назад
Rani Sadasiva Murty
197 подписчиков
117 просмотров · 9 дней назад
ప్రతి నిత్యం జనన మరణాలు ప్రకృతి సహజమైనవి. అవి మోదఖేద హేతువులు. నిన్నటిదాకా మనతో ఉన్న మనుషులు మాయం అయితే... మనం ఏం చెయ్యాలి? ఇదిగో సమాధానం...
నిన్నటి మనుషులు నేడు మాయము
మనసుకు మాత్రం మిగులు గాయము
కర్పూరము వలె కరుగు ప్రాయము
గురుతులు చెరిగి ఒరుగు కాయము
నిన్నటి మనుషులు నేడు మాయము
మనసుకు మాత్రం మిగులు గాయము।।
ఆశలు శ్వాసకు వేయు గాలము
మమతలు నిలుచును ఎంత కాలము
తనువొకనాటికి చిరిగిన చేలము
పిడుగులు పడినా విడువకు మూలము
నిన్నటి మనుషులు నేడు మాయము
మనసుకు మాత్రం మిగులు గాయము
గడచిన నిమిషం మరల మరి రాదు
వీచినగాలి తిరిగి వీచదు
దివ్వెగ వెలిగిన చమురు మిగలదు
వాలున సాగే ఏరు నిలువదు
నిన్నటి మనుషులు నేడు మాయము
మనసుకు మాత్రం మిగులు గాయము
చెలిమి బలిమిలో తొలగు ఖేదము
మంచిని చేసిన కలుగు మోదము
అలసిన అహమున తగదు వాదము
నిర్వేదము నీ చివరి వేదము
నిన్నటి మనుషులు నేడు మాయము
మనసుకు మాత్రం మిగులు గాయము
మనసుకు మాత్రం మిగులు గాయము
మనసుకు మాత్రం మిగులు గాయము