నిత్యాత్ముడై యుండి - అన్నమయ్య సంకీర్తన (Nityatmudai Yundi - Annamayya Sankeerthana) Lyrics
Bijjam Brothers
0:00 / 0:00
నిత్యాత్ముడై యుండి - అన్నమయ్య సంకీర్తన (Nityatmudai Yundi - Annamayya Sankeerthana) Lyrics
98 880 просмотров · 4 г. назад
Bijjam Brothers
19,2 тыс. подписчиков
98 880 просмотров · 4 г. назад
నిత్యాత్ముడై యుండి - అన్నమయ్య సంకీర్తన (Nityatmudai Yundi - Annamayya Sankeerthana)
Singer & Composer – S V Ananda Battar garu
(Courtesy - TTD & Sri Venkateswara Recording Project)
Lyrics -
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సంస్తుత్యుఁడీ తిరువేంకటాద్రివిభుఁడు
ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాతఁడేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతఁ-
డేమూర్తి నిజమోక్షమియ్యఁ జాలెడునాతఁడేమూర్తి లోకైకహితుఁడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియునుఁగాఁడు యేమూర్తి త్రైమూర్తి లేకమైనయాతఁ-
డేమూర్తి సర్వాత్ముఁడేమూర్తి పరమాత్ముఁడామూర్తి తిరువేంకటాద్రివిభుఁడు
యేదేవుదేహమున నిన్నియును జన్మించెనే దేవుదేహమున నిన్నియును నణఁగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవుఁడిజీవులిన్నింటిలో నుండు నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవుఁ డవ్యక్తుఁ డేదేవుఁ డద్వంద్వుఁడాదేవుఁ డీవేంకటాద్రివిభుఁడు
యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పు నిశ్వాస మీమహామారుతము యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశుఁ డేవేల్పు పరమేశుఁడేవేల్పు భువనైకహితమనోభావకుఁడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము ఆవేల్పు తిరువేంకటాద్రివిభుఁడు