భక్తి విశేషాలు | Bhakthi Visheshalu | 8th October 2026 | Devotional News Updates | Bhakthi TV
Bhakthi TV
0:00 / 0:00
భక్తి విశేషాలు | Bhakthi Visheshalu | 8th October 2026 | Devotional News Updates | Bhakthi TV
1 168 просмотров · 9 часов назад
Bhakthi TV
3,13 млн подписчиков
1 168 просмотров · 9 часов назад
Watch : భక్తి విశేషాలు | Bhakthi Visheshalu | 8th October 2026 | Devotional News Updates | Bhakthi TV
తిరుమలలో అధికారులు ఊహించినట్లుగానే..గురువారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్సులోని 26కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. సర్వదర్శనం కోసం వైకుంఠంలోని 26కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులకు 6నుంచి 10 గంటలలో దర్శనం లభించవచ్చని టీటీడీ అధికారులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత ఆలయం బయటనుంచి లోపలకు వచ్చేవారికి 10నుంచి 12గంటలు,300రూపాయల శీఘ్రదర్శనానికి 4గంటల సమయం పడుతుందని తెలిపారు. బుధవారం స్వామివారిని 78వేల 777మంది భక్తులు దర్శించుకోగలిగారు. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల రూపంలో 4.35కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇదే సమయంలో పెరటాసి మాసం కూడా రావడంతో ఈ సారి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. 16న జరగనున్న గరుడ సేవకు భారీగా భక్తులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను తిరుమలకు అనుమతించరు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా తిరుపతిలోనే ఐదు చోట్ల వాహనాలు పార్కింగ్ మైదానాలు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ల బ్యానర్లను తిరుపతిలో ఏర్పాటు చేశారు. భక్తులు వారి వాహన రకాన్ని బట్టి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. ఎక్కడ పార్కుచేయాలో కనిపిస్తుంది.
హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు గురువారం తిరుమల శ్రీవారికి దాదాపు 25 లక్షల రూపాయల విలువైన రెండు బంగారు పగడాల హారాలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి హారాలను అందజేశారు.
అలాగే, హైదరాబాద్ కు చెందిన కొడాలి మారుతి శేషతల్ప సాయి అనే భక్తుడు టీటీడీ బర్డ్ ట్రస్టుకు 10లక్షల 116 రూపాయలు విరాళంగా అందించారు.
అదేవిధంగా అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ నల్లపాటి గిరిధర్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10లక్షల 116 రూపాయలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయం పవిత్రోత్సవాలలో పూర్ణాహుతి.నిర్వహించారు. శ్రీరామచంద్రస్వామి వారి దేవాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో ప్రాతఃకాలార్చన బాలబోగం నిర్వహించారు. యాగశాలలో గత మూడు రోజులు నుంచి నిర్వహిస్తున్న విశేష హోమాలకు వైదిక సిబ్బంది మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఆస్దానమండపంలో ఉత్సవమూర్తులను వేంచేపుచేసి కళ్యాణం నిర్వహించారు. గత మూడు రోజులు నుంచి 24 మంది ఋత్వికులు చేస్తున్న శ్రీమద్రామాయణం. సుందరకాండ పారాయణ అనంతరం శ్రీరామచంద్రస్వామి వారికి పట్టాబిషేకం నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వవచనం ఋత్విక్ సత్కారం జరిగింది. ఈకార్యక్రమంలో సహయ కమీషనర్ , కార్యనిర్వహణాధికారి వై. శ్రీనివాసరావు అర్చకులు, సిబ్బంది, పలువరు భక్తులు పాల్గొన్నారు.
మహానంది క్షేత్రంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ కామేశ్వరి దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆలయ చైర్మన్ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ముందుగా శ్రీ మహానందీశ్వర స్వామివారికి, శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
శతచండీయాగ పూర్వకంగా నవదుర్గాలంకారాలు, శ్రీచక్రార్చన, సహస్ర దీపాలంకార పూజలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగాఆలయంలో కొలువైన మూలవిరాట్‌కు ఉదయం, సాయంత్రం ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ఏఈవో మధు, పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రతిరోజూ లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఆలయ పాలకమండలి, ఆలయ అధికారులు నిర్ణయించారు. పదరోజులపాటు జరిగే ఉత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీశైల మహాక్షేత్రం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు రోజుకో విశిష్ట అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు.. స్వామి, అమ్మవార్లకు ప్రతిరోజూ ప్రత్యేక వాహనసేవలు నిర్వహించనున్నారు.
వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. అమ్మవారి వార్షిక శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 11 నుంచి 21వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో విశిష్ట అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► https://bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► https://bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► https://bit.ly/327Arku
☞ Follow us on Twitter ► https://bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► https://bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► https://bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.