Перейти к содержимому

ఏం సువాసన | Heart Touching Folk Song|#AndelaravaliOfficial #suvasana #AndeSridharReddy

Andela Ravali Official

0:00 / 0:00

ఏం సువాసన | Heart Touching Folk Song|#AndelaravaliOfficial #suvasana #AndeSridharReddy

1 254 240 просмотров · 1 месяц назад
Andela Ravali Official
8,38 тыс. подписчиков
1 254 240 просмотров · 1 месяц назад
ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన చినుకు రాలుతుంటె నేల మట్టి వాసన చిలక వాలమంటు పూల తేనె వాసన ప్రకృతంత మురిసిపోయే పరవశాల వాసన “ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన” పసితనాన మురిసిపోయె శిశువు వాసనా తనివితీర ఆటలోన గెలుపు వాసన మనవి ఆలకించు మనసు తృప్తివాసన మనసార చేరదీయు మమత వాసన ఈ జన్మమంత ఋణపడుండు మాతృహృదయ వాసన “ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన” కష్ట జీవి ఫలితమందు చెమట వాసనా ముష్టివాడు యాచించిన ధనము వాసన మండుటెండలోన చెట్టు నీడ వాసన వొళ్ళు మరచి వాలిపోతే కునుకు వాసన బ్రతుకుదెరువు బాధలన్నీ మలచుకున్న వాసనా “ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన” పరిణయాన ఏడడుగుల తోడు వాసన పంచుకున్న పరిచయాల రక్తి వాసన ఇచ్చిపుచ్చుకున్న మనసు ప్రేమ వాసన హత్తుకోన తనువున అనుబంధ వాసన యవ్వనాల జతలు కోసుకున్న వయసు వాసన “ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన” చిగురులోన నోరూరే వగరు వాసన గింజకొక్క రకమైన రుచుల వాసన నూనెలోని గోలిన తాళింపు వాసన కూరల్లో మసాలాలు కమ్మని వాసన కడుపు మంటలార్పుతున్న తిండి వాసన ఊరించే వంటకాల ఘుమఘుమల వాసన “ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన” కనుల వెనక దాచుకున్న కలల వాసన పొంగి పొరలి తరంగాల తపన వాసన జన్మించే ప్రతీ ప్రాణి సృష్టి వాసన గంతులెయు గమనానికి చలన వాసన చేరుకున్న గమ్యానికి తనివితీరే వాసన అలసి సొలసి కనులు వాల్చే నిదుర వాసన “ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన” గొంతు తడిని తీర్చుతున్న నీటి వాసన ప్రాణవాయువౌతుంటే గాలి వాసన వంగి నేలనందుకోన నింగి వాసన జీవినెముడు తీసుకెళ్తే మంట వాసనా నట్టనడుమ జీవితాన పుడమి వాసనా నీరు నిప్పు నింగి నేల పంచభూత వాసన “ఏం సువాసన ఏం సువాసన పరిసరాలలో ఏం సువాసన” ఈ పాట పుట్టుక భిక్కనూరు గ్రామం ( కామారెడ్డి జిల్లా) ప్రసిద్ధ స్వయంభూలింగమైన సిద్దరామేశ్వర గుడి పరిసర ప్రాంతాలలో జరిగింది. అక్కడి పచ్చని ప్రకృతి నన్ను ఎంతగానో ఆకట్టుకునేది,,హైదరాబాద్ కు 90 km దూరంలో , జాతీయ రహదారి 44, రైల్వే , పోచారం అటవీ ప్రాంతం ఉన్న అద్భుతమైన ప్రాంతం . ఆ వాతావరంలో గాలి పీల్చితేనే ప్రాణం హాయిగా ఉంటుంది . అక్కడి నీరు త్రాగి చూస్తే శరీరం అంతా తేలికగా ఒంట్లో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అన్నట్లు అనిపిస్తుంది . ఇది నేను అనుభవించి రాసిన పాట ...ఆ సిద్దరామేశ్వరుని ఆశీస్సులు ..ప్రకృతి రాసుకున్న పాట . వర్షం పడుతుంటే ఈ పాట వినండి మీకు ఏమనిపిచ్చిందో చెప్పండి ? జీవితంలో ఒక్కొక్క క్షణం , ఒక్కొక్క ప్రాంతం , ఒక్కొక్క సందర్భంలో మనం అనుభవించిన మధుర జ్ఞాపకాలే ఈ "సువాసన " మనసు ఎప్పుడు బాగలేకపొయినా ఈ పాట వింటే హాయిగా ఉంటుంది , నేను కొన్ని వేల సార్లు ప్రకృతిలో ఒంటరిగా పాడుకొని ప్రతీ వాఖ్యాన్ని ప్రకృతిలో ఉన్న సహజమైన మూల శబ్దం తో మిళితం చేసి శృతి చేసిన పాట. మీకు ఈ పాట వింటే నిరాశా నిస్పృహలు కరిగి జీవితంపై ఆశ చిగురిస్తుంది , ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరదు , జ్ఞాపకాలతో మీ మనసు పులకరిస్తుందని, ఒక్కసారి జీవితం మొత్తం ఓ సువాసనతో ఆస్వాదిస్తారని ఆశిస్తూ ...మీ అందెల రవళి (అందె శ్రీధర్ రెడ్డి ) 🌿 జీవితంలోని ప్రతీ సువాసనను... ప్రకృతి నుండి మనిషి వరకు... మనసును తాకే తెలుగు జానపద గీతం. Original Telugu Lyrics: Ande Sridhar Reddy 🎤 Presented by: Andelaravaliofficial 🎤Original Singing by Ande Sridhar Reddy, and produced using licensed AI-assisted tools 🎼 Initial Keyboard programmed by Ram Kolthuri and then Music produced using licensed AI-assisted tools. సహకారం: నిర్మల రాయల్ ✍️ Lyrics : అందెల రవళి (అందె శ్రీధర్ రెడ్డి) 🎵 మీ మనసుకు హత్తుకునే పాటలు