Перейти к содержимому

అర్థరాత్రి నడి రోడ్డుపై బట్టలు లేకుండా అమ్మాయి | Peerzadiguda Software Tejaswini Case Update

4SiDES TV

0:00 / 0:00

అర్థరాత్రి నడి రోడ్డుపై బట్టలు లేకుండా అమ్మాయి | Peerzadiguda Software Tejaswini Case Update

11 822 просмотра · 2 месяца назад
4SiDES TV
633 тыс. подписчиков
11 822 просмотра · 2 месяца назад
Watch: అర్థరాత్రి నడి రోడ్డుపై బట్టలు లేకుండా అమ్మాయి | Peerzadiguda Software Tejaswini Case Update | 4sidestv #peerzadiguda #tejaswinicase #hyderabad #breakingnews #latestnews #peerzadigudatejaswinicase #hyderabadnews #viralvideo #4sidestv మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని శంకర్‌నగర్‌లో జరిగిన వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నర గంటల సమయంలో ఓ యువతి నగ్నంగా వీధుల్లో పరుగులు తీసింది. ఆ సమయంలో ఓ వ్యక్తి భయపడుతూ పరుగులు పెట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అతడు ఎందుకు పరిగెత్తాడని గమనిస్తే, ఓ యువతి నగ్నంగా రోడ్లపై పరుగులు తీసింది. ఆపై తెల్లవారుజామున సమీపంలోని ఒక చెరువులో ఆమె మృతదేహం తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. యువతి నగ్నంగా పరుగులు తీసిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లి గ్రామానికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్‌రావు, అరుణ దంపతులకు కుమార్తె తేజస్విని ఉన్నారు. ఆమె కొంతకాలం కిందట బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసింది. అయితే వర్క్ ప్రెజర్ తట్టుకోలేక 6 నెలల కిందట జాబ్ మానేసింది. ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజులపాటు విశాఖపట్నంలో ఉంది. తండ్రి విశాఖపట్నంలోనే ఉంటుండగా, కొన్ని రోజుల కిందట తన తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన తేజస్విని పీర్జాదిగూడలోని శంకర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుంది. తల్లీకూతుళ్లు మరో అద్దె ఇంటి కోసం మియాపూర్ ప్రాంతంలో వెతికారు. అనంతరం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో తేజస్విని ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమీపంలోని సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి తిరిగి పీర్జాదిగూడలోని తమ అద్దె ఇంటికి వచ్చి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె తన తల్లి ఇంట్లోనే ఉండగా బయట నుండి తాళం వేసింది. ఆపై ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా రోడ్డుపైకి పరుగులు తీసింది. ఆ క్రమంలో సమీపంలోని ఒక దేవాలయం నుండి విగ్రహాన్ని కూడా తీసుకువెళ్లింది. తెల్లవారేసరికి ఆమె చెరువులో పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె కొంతకాలంగా భయాలు, పీడకలల గురించి చెబుతుండేదని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. అయితే తేజస్విని మృతికి కచ్చితమైన కారణం ఏమిటనేది పూర్తి దర్యాప్తు, పోస్టుమార్టం నివేదిక అనంతరమే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ఒత్తిడి లేదా మానసిక సమస్యలే ఈ ఘటనకు ప్రత్యక్ష కారణమని ప్రస్తుత దశలో నిర్ధారించలేము. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, ఈ విచిత్ర ప్రవర్తన వెనుక మానసిక కారణాలు ఉన్నాయా లేదా ఎవరైనా చేతబడి చేశారా అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. యువతి మృతిపై కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. For Latest News : https://foursidestv.com/ For More Latest Political and News Updates : Welcome to [ 4Sides TV ], the pulse of Andhra Pradesh and Telangana! We bring you the fastest, most reliable, and in-depth Telugu News Updates across all major categories. Subscribe for Daily News that matters: Telugu Political News: Live coverage and expert analysis on AP Politics (Jagan, Chandrababu, Pawan Kalyan) and Telangana Politics (KCR, Revanth Reddy). Breaking News & Current Affairs: Instant updates on national, international, and local news across Hyderabad, Vizag, Vijayawada, and more. Business & Market News: Comprehensive coverage of Stock Market, Gold Price, and economic developments in Telugu. Crime & Social Issues: Investigative reports on major Crime Stories and pressing social topics. Telugu Cinema (Tollywood): The latest on movie reviews, celebrity interviews, and film industry gossip. ►Subscribe to 4Sides TV:    / @4sidestvtelugu   ►Follow us on Instagram:   / 4sidestvtelugu   ►Like us on Facebook:   / foursidestvtelugu   ►Follow us on Twitter:   / 4sidestvtelugu