కన్నులెత్తినిన్నే చూస్తున్నా | KANNULETHI NINNE CHUSTHUNNA | FULL SONG | CHRISTIAN SONG
A.O.Y Ministry, T. Solomon Raj
0:00 / 0:00
కన్నులెత్తినిన్నే చూస్తున్నా | KANNULETHI NINNE CHUSTHUNNA | FULL SONG | CHRISTIAN SONG
2 748 просмотров · 2 месяца назад
A.O.Y Ministry, T. Solomon Raj
3,21 тыс. подписчиков
2 748 просмотров · 2 месяца назад
కన్నులెత్తినిన్నే చూస్తున్నా | KANNULETHI NINNE CHUSTHUNNA | FULL SONG | LATEST TELUGU CHRISTIAN SONG | 2026 | A.O.Y Ministry
FOR MORE VIDEOS
SUBSCRIBE TO @SolomonThadikamalla
Lyrics & Tune : Elder T.Solomon Raj garu
Vocals : ELIYA GUNDETI
Music : Charan Studio Kmm
Editing & DOP : Krupa Studio Kmm
కన్నులెత్తి నిన్ను చూస్తున్నా
పల్లవి:-
నా జన్మకు కారణమేమో నేనెందుకు జన్మించానో నాతో నీ ప్రణాళికేమో తెలియదు మెస్సీయ మనసునందు నెమ్మది లేక పలకరించు తోడు లేక బ్రతుకు నందు ఆశలు లేక కన్నులెత్తి నిన్ను చూస్తున్నా ఏదో ఒక రోజు నన్ను దర్శిస్తావని నా జన్మకు కారణమేమో బదులిస్తావని
2
చరణం 1
కంటికి నిద్దర కరువాయే చీకటి తెర విడిపోదాయే మనసుకు నెమ్మది లేదాయె జీవించుట ఎందులకు తల్లి గర్భమున పిండముగా రూపించినది నీవేగా ఈ దీనుని మొర ఆలించి దయ చూపించగ దిగి రావా ఈ పెనుగాలికి ఊగిసలాడే అకాల ఫలమును నేను కదా 2
2
చరణం 2
నా
నిజమని నమ్మితి అందరినీ ఎందరు ఉన్నా ఒంటరిని గమ్యం తెలియని యాత్రికుడై నీ ఒడికి చేరితిని చీకటి కమ్మిన శోధనలు నలు దిశలుగ నను వ్యాపించెన్ ఎవరికి తెలియని గాయములు ఎద మాటున అవి నిదురించెన్ ఈ జడివానకు గూడు చెదిరిన ఒంటరి గువ్వను నేను కద 2
2
చరణం 3
ప్రియుడా నా స్తితి పరికించి నీ చిరు ప్రేమను కురిపించి నా శోధన మైమరిపించి నను మురిపించితివి చూడుము నా అరచేతులలో చక్కగ చెక్కెదనన్నావు తల్లి మరిచిన మరువననే వాగ్దానము నెరవేర్చావు ఏ క్షణమైన నన్ను విడువక నీ పోలికగా మలుచుమయా
2