ప్రభు యేసు నా రక్షకా — నొసగు కన్నులు నాకు -డా. మళ్లా యేసుపాదం గారు
MALLA YESUPADAM
0:00 / 0:00
ప్రభు యేసు నా రక్షకా — నొసగు కన్నులు నాకు -డా. మళ్లా యేసుపాదం గారు
10 просмотров · 1 день назад
MALLA YESUPADAM
113 подписчиков
10 просмотров · 1 день назад
పాట సంఖ్య: 93 — ప్రభు యేసు నా రక్షకా
పల్లవి
ప్రభు యేసు నా రక్షకా — నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను చూడ — అల్ఫయు నీవే ఓమెగయు నీవే
1. చరణం
లెక్కలేని మార్లు పడిపోతిని — దిక్కులేనివాడనైతిని
చక్కజేసి నా నేత్రాలు తెరచి — గ్రక్కున నిన్ను జూడనిమ్ము
2. చరణం
ఎరిగి ఎరిగి నే చెడిపోతిని — యేసు నీ గాయము రేపితిని
మోసపోతి నేను దృష్టి తొలగితి — దాసుడా నిను చూడనిమ్ము
3. చరణం
లోక భోగాలపై నా నేత్రాలు — సోకకుండునట్లు కృప జూపుము
నీ మహిమ దివ్య స్వరూపమును — నిండార నను జూడనిమ్ము
"ప్రభు యేసు నా రక్షకా, నొసగు కన్నులు నిరతము నే నిన్ను చూడ, అల్ఫా ఒమేగా నీవే అని చెప్పేసి మరి ఈ పాట పాడుకొని దేవుని మహిమ పరచుకుందాము. మరి దేవుని పాటించేటప్పుడు చాలాసార్లు పడిపోతా ఉంటాము, ఎరిగి ఎరిగి కూడా చెడిపోతా ఉంటాము, ఆయన గాయాలు రేపే వారిగా ఉంటాము. లోక భోగాలపై నేత్రాలపై కూడా మరి మనం దృష్టి నిలుపుతా ఉంటాము. కాబట్టి మరి ఈ పాటని పాడుకొని మన జీవితాల్లో చాలామంది దేవుని అనుసరించే బిడ్డలుగా ఉండాలి. కృప చూపే దేవుడు అన్నమాట అండి. అందరికీ వందనాలు."
ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ, ఎంతో మధురంగా ఆలపించిన సువార్తికులు, సహోదరులు డా. మళ్లా యేసుపాదం గారికి దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యములను ప్రసాదించును గాక