తలచరొ జనులు ఈతని పుణ్యనామములు ...గాయకుడు అలంకొండ సూరి గారు#trending#like #explore #annamayyasong
Mana sampradayam
0:00 / 0:00
తలచరొ జనులు ఈతని పుణ్యనామములు ...గాయకుడు అలంకొండ సూరి గారు#trending#like #explore #annamayyasong
3 751 просмотр · 5 дней назад
Mana sampradayam
4,1 тыс. подписчиков
3 751 просмотр · 5 дней назад
కళ్యాని రాగం : ఆది తాళం
పల్లవి :- తలచరో జనులు యీతని పుణ్య నామములు
సులభముననే సర్వ శుభములు కలుగు.
చరణం:- హనుమంతుడు వాయుజు డంజనా తనయుడు
వనధి లంఘన శీల వైభవుడు
దనుజాంతకుడు సంజీవనీ శైల సాధకుడు
ఘనుడు కలశాపుర హనుమంతుడు.
చరణం:- చటులార్జున సఖుడు జాతరూప వర్ణుడు
ఇటమీద బ్రహ్మ పట్ట మేలేటి వాడు
నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుడు
పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు.