5 ఎకరాల బొప్పాయితో ఈ యువ రైతు దశ మారింది || తెలుగు రైతుబడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
5 ఎకరాల బొప్పాయితో ఈ యువ రైతు దశ మారింది || తెలుగు రైతుబడి
237 894 просмотра · 6 лет назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
237 894 просмотра · 6 лет назад
అయిదేండ్లుగా బొప్పాయి సాగు చేస్తున్న రైతు చింతరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేనంత లాభాన్ని ఇటీవల అందుకున్నారు. 5 ఎకరాల్లో బొప్పాయి సాగు చేసిన అతనికి 30 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఎలా సాధ్యమైంది? అంత లాభం ఎలా వచ్చింది? వంటి అనేక అంశాలను తెలుగు రైతుబడి తొలి వీడియోలో పంచుకున్నారు. మీరు కూడా చూడండి.
యువరైతు సంచలన విజయం || Rs 30 Lakhs Profit with 5 Acres Cultivation || Telugu Raithu Badi (2020)
తెలుగు రైతుబడి గురించి :
నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన చానెల్ లో కొత్త వీడియో పబ్లిష్ అవుతుంది.
తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
Contact us :
Mail : telugurythubadi@gmail.com
#తెలుగురైతుబడి #TeluguRaithuBadi #PapayaFarming #బొప్పాయిసాగు