Перейти к содержимому

గుడివాడలో కన్నుల పండుగగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 🙏 #Krishna #Janmashtami #Gudivada

Sania Vlogs 222

0:00 / 0:00

గుడివాడలో కన్నుల పండుగగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 🙏 #Krishna #Janmashtami #Gudivada

647 просмотров · 2 дн. назад
Sania Vlogs 222
5,99 тыс. подписчиков
647 просмотров · 2 дн. назад
గుడివాడలో కన్నుల పండుగగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 🙏 #Krishna #Janmashtami #Gudivada 🙏 మన గుడివాడలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 🙏 గుడివాడలో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రభోదానంద యోగీశ్వరుల వారి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ SDPO పాల శ్రీనివాసరావు గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వ ప్రపంచానికి అర్జునుడి ద్వారా తెలియజేసిన భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదివి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలని, ధర్మాన్ని ఆచరించి మోక్ష మార్గంలో పయనించాలని సందేశం ఇచ్చారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథిని చిరు సత్కారంతో గౌరవించి త్రైత సిద్ధాంత భగవద్గీతను అందజేశారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భగవద్గీత ముఖ్య శ్లోకాలు, భావము, పఠనము, గురుపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. చివరి రోజు సెప్టెంబర్ 11న స్వామివారి పల్లకి సేవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు రావుల కొల్లు మల్లేశ్వరరావు, అగస్తీ ఆది విష్ణు, కొలుసు రాజా, గండికోట రాము, మూర్తి, లక్ష్మి, కల్వగుంట శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే Like 👍 Share 🔄 Subscribe 🔔 చేయండి. #SriKrishna #Janmashtami #Gudivada #BhagavadGita #KrishnaBhakti #GudivadaVlogs #SaniaVlogs222    / @saniavolgs222