Перейти к содержимому

నియోజవర్గ అభివృద్ధి పనులకు 1232 కోట్ల రూపాయల నిధులకు cm హామీ - mla గిడ్డి సత్యనారాయణ | public 9 news

PUBLIC 9 NEWS

0:00 / 0:00

నియోజవర్గ అభివృద్ధి పనులకు 1232 కోట్ల రూపాయల నిధులకు cm హామీ - mla గిడ్డి సత్యనారాయణ | public 9 news

99 просмотров · 10 дней назад
PUBLIC 9 NEWS
81 тыс. подписчиков
99 просмотров · 10 дней назад
#public9news #mlagiddisatyanarayana #tdpbjpjanasenaalliance వైసిపి పై ఫైర్ అయిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. నియోజవర్గ పర్యటనలో భాగంగా అభివృద్ధి పనులకు 1232 కోట్ల రూపాయల నిధులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు - ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా.... పి. గన్నవరం నియోజకవర్గంలోనీ మాచవరంలో ఈనెల 9 తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిమిత్తం 1232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 22 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు. ఇప్పటికే సంబంధిత అధికారులు తనతో అభివృద్ధి పనుల నిమిత్తం సంప్రదింపులు జరిపారని తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని రోడ్లు, త్రాగు నీరు, సాగునీరు, కొబ్బరి బోర్డు ఏర్పాటు వంటి ముఖ్య విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రెండున్నర సంవత్సరాలలో నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసిపి పార్టీ విమర్శలు చేయడం దారుణమని, కళ్ళు తెరుచుకుని అభివృద్ధిని చూడాలని అన్నారు. త్వరలోనే జిల్లాలో కొబ్బరిబోర్డు ఏర్పాటు అవుతుందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు.