గోపురములు పడు మహా హత్య దినమున/పూరీము పండుగ 09.01.22 32nd Anniversary BROOKS Visakhapatnam @Ronshers
Brooks Church VIsakhapatnam
0:00 / 0:00
గోపురములు పడు మహా హత్య దినమున/పూరీము పండుగ 09.01.22 32nd Anniversary BROOKS Visakhapatnam @Ronshers
1 128 просмотров · Трансляция закончилась 4 г. назад
Brooks Church VIsakhapatnam
10,7 тыс. подписчиков
1 128 просмотров · Трансляция закончилась 4 г. назад
Song-1
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే
1.యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
2.నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
3.నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
Song-2
సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం
నీవే నా నమ్మకం
గడచిన కాలము
నాతో ఉన్నావు
నేడు నాతోడు నడచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో
నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలాలెన్నైనా
అవి నీ పాదముల క్రిందనే
వ్యాధి నను చుట్టిన
లెమ్మని సెలవిచ్చేదవు
యెహోవా రాఫా
నీవే నా స్వస్థత
ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఈ ఆయు
Song-3
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి
నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం
నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా
1. మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
చిగురాశల దిశగా నను పయనింపజేసినా
నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే
2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే
దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
L
కనుపాపగ నను కాచిన నామంచి కాపరి
3.చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు
చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా
Song-4
ఏ యోగ్యతా లేని నాకింత భాగ్యమా
నీ సేవ చేయగలిగే ఇట్టి అవకాశమా
ఊహించలేదు ఎపుడు ఈనాటి నా స్థితిని ఆశించువాటికంటే అధికముగా పొందగలనని. ఈలాటి దీవెనలకు పాత్రుడనా నేను. ఇంతగా హెచ్చించుటకు ఏపాటివాడను నీకే యేసు మహిమ బలమ. నీవలననే నాకు జయము
ప్రేమతో వరములు ఇచ్చి నేర్పరిగా చేశావు. జ్ఞానముతో ఉపయోగించే నైపుణ్యమునుఇచ్చావరాజ్యాధికారుల ఎదుట నిలబెట్టినావు. మేలుకరమగు పరిచర్య జరిగించుచున్నావు నీకే యేసు మహిమ బలమ. నీవలననే నాకు జయము
గర్భమున వుండినపుడే నను ఎన్నుకున్నావు. ప్రత్యేక ఉద్దేశమును నా పట్ల కలిగున్నావు. ఏ రీతి నీ ఋణము తీర్చుకోగలన. జీవితము నీ పని కొరకు అంకితం చేశాను నీకే యేసు మహిమ బలమ. నీవలననే నాకు జయము