TPM Vijayawada Convention 2025 Song 04 || యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే
TPM Telugu Lyrics Channel
0:00 / 0:00
TPM Vijayawada Convention 2025 Song 04 || యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే
114 430 просмотров · 1 год назад
TPM Telugu Lyrics Channel
4,92 тыс. подписчиков
114 430 просмотров · 1 год назад
#tpm #tpmtodaymessage #tpmsongs
పల్లవి:
యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే
నిజమైన స్నేహితుడే ఈ భువిలో
విడువక ప్రేమించును - నిత్యము నడిపించును - యేసయ్యతో
చరణములు
1.మీరు నాకు స్నేహితులను పలికిన యేసయ్యా
మమ్మును ప్రేమించి ప్రాణమిచ్చిన నాథా
మరణము వరకు నిన్నే ప్రేమించి
మనసార సేవింప కృపనీయుము దేవా!
2.అబ్రహాము నాకు స్నేహితుడని చెప్పితిరే
అనేక జాతులకు తండ్రిగా చేసితిరే
నీకు నే లోబడి నీతిగా నడచి
నిన్నే వెంబడింప విశ్వాసమీయుము
3. స్నేహితుడు లాజరును మరణమునుండి
లేపిన యేసయ్యా మరణకట్లు తొలగించు
పునరుథానశక్తితో జీవింపజేసి
ప్రభువా నీ సాక్షిగా నిల్పుము దయతో
4.మోషేను స్నేహితునిగా ఎంచిన ప్రభువా !
ముఖాముఖిగానే మాట్లాడిన దేవా !
నా హృది కలతతో నిండిన వేళ
నాతోనే మాట్లాడి ధైర్యపర్చు యేసయ్యా
5.నేనే మిమ్మున్ లోకమునుండి ఏర్పర్చుకొంటిని
మీరు లోకసంబంధులు కారని చెప్పితిరి
లోకమున్ ప్రేమించక మిమ్మును స్నేహించి
పిలుపుకు తగినట్లు ఫలింపజేయు దేవా!