Перейти к содержимому

వాళ్లంతా టెట్ పాస్ కావాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Supreme Court Big Verdict on TET! | ABN

ABN Legal

0:00 / 0:00

వాళ్లంతా టెట్ పాస్ కావాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Supreme Court Big Verdict on TET! | ABN

1 534 просмотра · 4 месяца назад
ABN Legal
120 тыс. подписчиков
1 534 просмотра · 4 месяца назад
#TETVerdict #SupremeCourt #TeacherNews #TETMandatory #EducationSystemIndia #BreakingNewsIndia #GovtTeachers #RightToEducation #Article21A #TET2026 #abnlegal వాళ్లంతా టెట్ పాస్ కావాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! Supreme Court Big Verdict on TET! | ABN Legal దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల అర్హతలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిర్దేశిత సమయంలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ రాసి ఖచ్చితంగా అర్హత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును సవాలు చేస్తూ వివిధ ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ధర్మాసనం పూర్తిగా కొట్టేసింది. అయితే ఉపాధ్యాయుల భవిష్యత్తును, విద్యార్థుల విద్యావ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. టెట్ పాస్ కావడానికి ఇది వరకు ఇచ్చిన రెండేళ్ల గడువును మాత్రం మూడేళ్లకు పెంచుతూ కొంత ఉపశమనం కల్పించింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తాజా సవరణ ప్రకారం.. ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించడానికి ఇదివరకు ఉన్న 2027 ఆగస్టు 31 డెడ్‌లైన్‌ను.. ఇప్పుడు 2028 ఆగస్టు 31 వరకు పొడిగించబడింది. ఈ ఒక్క మార్పు మినహా గతంలో ఇచ్చిన తీర్పులోని మిగతా అన్ని అంశాలు యథావిధిగా అమలులో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టం రాకముందు నియమితులై, తమ ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు అందరూ.. ఉద్యోగంలో కొనసాగాలన్నా లేదా పదోన్నతులు పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని 2025 సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most. Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,