కడలి అలలు కన్నా సాంగ్
B.GANDHI OFFICIAL
0:00 / 0:00
కడలి అలలు కన్నా సాంగ్
765 просмотров · 2 нед. назад
B.GANDHI OFFICIAL
941 подписчик
765 просмотров · 2 нед. назад
కడలి అలల కన్నా - కఠినమైనది నా వేదన
కలత చెందకు మని - ధైర్యం చెప్పేది నీవేగా
నా కన్నీటిని తుడిచే - కరుణామయుడా యేసయ్యా
నా గుండె చప్పుడు నీవే - నా బ్రతుకు పాట నీవే
కడలి అలల కన్నా - కఠినమైనది నా వేదన
కలత చెందకు మని - ధైర్యం చెప్పేది నీవేగా
లోకమంతా నన్ను విడిచినా - బంధాలన్నీ దూరమైనా
చీకటి దారిలో దీపమై - నా చేయి పట్టి నడిపినావు
మనుషుల మాటలు గాయపరచినా - మారని నీ ప్రేమే నన్ను ఆదరించెను
ఒంటరి పయనంలో జంటగా నిలిచిన - నా ప్రాణానికి ఆధారం నీవేగా
కడలి అలల కన్నా - కఠినమైనది నా వేదన
కలత చెందకు మని - ధైర్యం చెప్పేది నీవేగా
ఆశలన్నీ అడియాశలైనా - అలసిపోయిన నా పయనంలో
గమ్యం తెలియక ఆగిపోతే - గెలుపు బాటను చూపినావు
తుఫానులు ఎన్నెన్నో రేగినా - నా నావకు రేవు నీవేనయ్యా
నీ కృప చాలును ఈ బ్రతుకుకు - శాశ్వతమైనది నీ స్నేహమేగా
నా ప్రాణానికి ఆధారం నీవేగా...
యేసయ్యా... నీవేగా...