Song : Naa draksha Thotalo lo Pani Vunnadi || Keys _ Joel || Vocal - Danny Cepha ||
Daniel Philomon Kepha
0:00 / 0:00
Song : Naa draksha Thotalo lo Pani Vunnadi || Keys _ Joel || Vocal - Danny Cepha ||
273 просмотра · 4 дн. назад
Daniel Philomon Kepha
48 подписчиков
273 просмотра · 4 дн. назад
400. (371) "మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్ళుడి" (మత్తయి 20 : 4)
'ప॥ నా ద్రాక్షతోటలో పనియున్నదెంతో - (2) రారండి పనిచేయగ ఇష్టంబుతోడ - పనిచేతురేని - (2) న్యాయంపు ఫలమిచ్చుడున్
1. నిస్సారమగువాటికై - తాత్కాలికమగువాటికై సమయము వ్యర్థంబుచేసెదరేల ? గమనించి నాతోడ పనిచేయగ - అర్పించుకో ప్రభుకై
||నా ద్రాక్ష1
2. నా కాడి సుళువైనది-నా భారము తేలిక, దున్నుము నాతోడ సహకారిగా-వన్నైన సత్ఫలముల నొందగా-అర్పించుకో ప్రియుడా
॥నా ద్రాక్ష
3. శత్రువు చొరకుండగ - మిత్రులు సమకూడగ, కాపాడు నా తోడ ద్రాక్షావళిన్ మెండైన జీవము చూపించను ముందంజ వేయుమిదే
॥నా ద్రాక్ష
4. భయమొంది దాగకుము-జయమొంద జంకకుము, గానుగ చాటున నుండకుము కుంచము మాటుకు చేరకుము- ధైర్యంబుతో సాగుము
॥నా ద్రాక్ష
5. నీ దాసుడను నేనిదే-కొంటివి రక్తముతో, నీ చిత్తము నాలో నెరవేర్చుము నీ వాక్యములో నన్ను స్థిరపర్చుము అనుసరించగ నిత్యము
॥నా ద్రాక్ష