Ichchapuram Floods: NH-16పై బాహుదా వరద బీభత్సం | Cyclone Arnab | Srikakulam Flood News | ABP Desam
ABP Desam
0:00 / 0:00
Ichchapuram Floods: NH-16పై బాహుదా వరద బీభత్సం | Cyclone Arnab | Srikakulam Flood News | ABP Desam
196 796 просмотров · 1 дн. назад
ABP Desam
790 тыс. подписчиков
196 796 просмотров · 1 дн. назад
#IchchapuramFloods #Ichchapuram #SrikakulamFloods #BahudaRiver #CycloneArnab #NH16 #AndhraPradesh #APFloods #FloodAlert #HeavyRainfall #ABPTeluguNews #ABPDesam #TeluguNews
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం.. వరద గుప్పిట్లో చిక్కుకుంది. అర్నాబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి పట్టణం పూర్తిగా జలదిగ్బంధమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు... ఎగువన ఒడిశా నుంచి.. బాహుదా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. పరిస్థితి అదుపు తప్పింది.
నది ఉగ్రరూపం దాల్చడంతో వరద నీరు పట్టణాన్ని ముంచెత్తింది. అనేక నివాస ప్రాంతాలు, కాలనీలు నీట మునగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే నేషనల్ హైవే-16 పైకి.. బాహుదా వరద నీరు భారీగా వచ్చి చేరింది. హైవే పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
రంగంలోకి దిగిన పోలీసులు, అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎవరూ ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Heavy rainfall and rising floodwaters from the Bahuda River have reportedly caused severe waterlogging in Ichchapuram, Srikakulam district, Andhra Pradesh.
Floodwater from upstream areas of Odisha has added to the river's flow, inundating residential colonies and low-lying areas. The situation has also affected National Highway 16, where overflowing floodwaters have disrupted vehicle movement.
Police and local authorities are taking precautionary measures and warning people to avoid flooded roads and unnecessary travel. Arrangements are also being made to move residents from vulnerable areas to safer locations.
Watch this report for the latest updates on the Ichchapuram floods, Bahuda River flooding, NH-16 traffic disruption, and the situation in Srikakulam district.
⚠️ Safety Advisory: Avoid crossing flooded roads or flowing water. Follow official instructions and local emergency advisories.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam