శ్రీమద్భగవద్గీత 63 121026ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ।
Krishna Prem
0:00 / 0:00
శ్రీమద్భగవద్గీత 63 121026ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ।
36 просмотров · 9 дней назад
Krishna Prem
37 подписчиков
36 просмотров · 9 дней назад
శ్రీమద్భగవద్గీత 6.3
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ।
ఆరురుక్షోః — ప్రారంభదశలో ఉన్నవారు; మునేః — మునికి; యోగం — యోగమునకు; కర్మ — ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయటం; కారణం — కారణము; ఉచ్యతే — అందురు; యోగ-ఆరూఢస్య — యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్నవారు; తస్య — వారి; ఏవ — నిజముగా; శమః — ధ్యానము; కారణం — కారణము; ఉచ్యతే — అంటారు.
యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న (ప్రారంభ-దశ) జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు; యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు.