Перейти к содержимому

మోపిదేవి క్షేత్రం దర్శించుకున్న అనంత పద్మనాభస్వామి దేవస్థాన ట్రస్టీ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీబాయి

JSHNews789

0:00 / 0:00

మోపిదేవి క్షేత్రం దర్శించుకున్న అనంత పద్మనాభస్వామి దేవస్థాన ట్రస్టీ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీబాయి

1 846 просмотров · 10 месяцев назад
JSHNews789
1,28 тыс. подписчиков
1 846 просмотров · 10 месяцев назад
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో అనంత పద్మనాభస్వామి దేవస్థాన ట్రస్టీ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీ బాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రముగా విరాజుల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థాన ట్రస్టీ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీబాయ్ దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన ప్రిన్సెస్ ఆఫ్ ట్రావెన్ కోర్ గౌరీ లక్ష్మీబాయికి దేవస్థాన కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, ముఖ్య అర్చక బుద్దు సతీష్ శర్మల ఆధ్వర్యంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ నిర్మాత, ప్రముఖ సినీ నటులు కొల్లా అశోక్ కుమార్ తో కలిసి గౌరీ లక్ష్మీబాయి ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రిన్సెస్ ఆఫ్ ట్రావెన్ లక్ష్మీబాయిని అలాగే కొల్లా అశోక్ కుమార్ లను దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి, ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.