Sri Vinayaka Geetamala || Lord Ganesh Devotionals || Devotional Song || My Bhakthi Tv
MyBhaktitv
0:00 / 0:00
Sri Vinayaka Geetamala || Lord Ganesh Devotionals || Devotional Song || My Bhakthi Tv
124 570 просмотров · 5 л. назад
MyBhaktitv
633 тыс. подписчиков
124 570 просмотров · 5 л. назад
Title: Sri Vinayaka Geetamala
Devotional Song
Lyrics:Srirangam Jogi
Copmposer: Sudarshanam Venu Madhav
Singer: Ghatti SriVidya
#vinayakachalisa
#vinayakadevotionalsongs
#lordganeshdevotionalsongs
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
తొలి దంపతుల తొలి సుతుడు
తొలి పూజలనందే ఘన విభుడు
విఘ్ననాశక భయ హరుడు
విశ్వ పాలక శుభ చరుడు
కోరస్ 1 :గం గం గం గం గణాదిపా
గజముఖ వరదా గణాదిపా
కోరస్ 2:తొలి దంపతుల తొలి సుతుడు
అమ్మ నలుగుతో అమరేవు
అమ్మ జిలుగులు పొందేవు
అమ్మ వాకిట నిలిచేవు
అయ్యతొ పోరున నిలిచేవు
తగవులాటలో తల తెగి
అమ్మ మాటతో తల కుదిరి
శివ జ్ఞానముతో వెలిగేవు
శివ సన్నిధిలో నిలిచేవు
"గ "వర్ణమున నీ నామం
"గం" భీజముగా నీ మంత్రం
సాకారమున నీ రూపం
ఓం కారమున నీ తేజం
వక్రతుండమగు వేషముతో
బ్రహ్మ తేజమున భాసించి
ఏక దంతమున ఏలికగా
ఎఱుక చేసెను ఏకంగా
శూర్ప కర్ణముల శోభించి
సిద్ధి బుద్దులతో భాసించి
శివ సన్నిధిలో మెలిగావు
శుభములు కూర్చుట నెరిగావు
గుజ్జు రూపమును దాల్చేవు
ఒజ్జగా పూజలు బడసేవు
విరాట్ స్వరూపమున విరిసేవు
విఘ్న గణముల శాసించేవు
గణముల కధిపతివయ్యావు
గణపతిగా ఘనత నొందావు
నాట్య శాస్త్ర నైపుణ్యముతో
నాట్య గణపతిగ తెలిసేవు
చతుర్భుజముల నీ రూపము
పిత్రాంకమే నీ ప్రియ పీఠము
పాశాంకుశాల నీ హస్తము
ఆ జంట కూడేను అభయాస్తము
పార్వతి దేవి ప్రియ సుతుడు
అగ్నిరూపునకు అగ్రజుడు
ప్రమధ గణములకు ఆధ్యుడు
పరమానంద స్వరూపుడు
ఈశుడు మెచ్చిన పాలకుడై
వ్యాసుడు మెచ్చిన లేఖకుడై
పంచమ వేదం వ్రాసితివి
ప్రత్యేకత నీదని తెలిపితివి
క్షామములను తొలగించేవు
క్షేమములను చేకూర్చేవు
కామమును కడతేర్ఛేవు
కామ్యములను ఈడేర్చేవు
శూల హస్తమున శోభించేవు
కాల హస్తమున కనిపించేవు
నీలాబ్జ నిలయునిగా తెలిసేవు
ఉపమానములకు మించేవు
ఘంటమయినది నీ దంతం
అసురునంతము చేసెను దంతం
ఘనత చాటెను ఆ ఉదంతం
గణాధిపతునకే ఇది సొంతం
నిత్య బాలునిగ అగుపిస్తూ
నిర్గుణ బ్రహ్మ మనిపిస్తూ
నింగి నేలల భాసించేవు
నిత్య పూజలు బడసేవు
గరికకు ఘనతను ఒసగేవు
నీ పూజలొ నిలువగ జేసేవు
మోదక మందగ మురిసేవు
మహదానందం నొసగేవు
చిత్రమైనది నీ చరిత
విచిత్ర మైనది నీ ఘనత
తల్లి ప్రేమతో నిలిచేవు
తండ్రితొ తలపడ తెలిసేవు
ఎలుకను ఎక్కి ఎగిరేవు
ఎల్ల లోకములు తిరిగేవు
ఎల్ల విఘ్నముల నణచేవు
ఎదురు లేదని చాటేవు
అదితి గర్భమున అమరేవు
కాశ్యపేయునిగ తెలిసేవు
పలు నామాల పెరిగేవు
పలు రూపాల మెరిసేవు
అందరి దీవెనలందేవు
అసుర సంహారం చేసేవు
అక్షయమైనది నీ లీల
విలక్షణమైనది నీ హేల
సంపూర్ణ కళాపూర్ణ
విఘ్న దోష సంస్కరణా
సిద్ది బుద్ది ప్రియ సదనా
సర్వలోక సంస్మరణా
అష్ట భుజముల అగుపించి
తరుణ గణపతిగ కనిపించి
విరజను అంతము చేసావు
నీ జయమును జగతికి ఒసగావు
భక్త గణపతిగ భాసించావు
చతుర్భుజముల శోభించినావు
గుడపాయస పాత్రను దాల్చావు
గండములన్నీ దాటించావు
షోడశ భుజ సంభూత
శోక దుఃఖ పరిహారా
చక్రాయుధ దర సుందరా
శక్తాయుధ నిజ శోభితా
పరశు హస్తమున దాల్చేవు
వీర గణపతిగ తెలిసేవు
ఖట్వాంగముతో కనిపించి
శూల పాశముల మెరిసేవు
బహు రూపాల ప్రభవించేవు
బహు నామాల తెలిసేవు
బహుముఖ ప్రజ్ఞతో వెలిగేవు
బహు కార్యాల నిలిచేవు
సకల కళలకు నువు నిలయం
విశ్వ వ్యాప్తికి నువు వలయం
సకల కార్యముల నీ సంకల్పం
సర్వ జగతికి అది మూలం
గణనాయకా సకల గుణ దాయకా
వరదాయకా సర్వ శుభ కారకా
గణ సేవితా దివ్య గుణ శోభితా
జన పూజితా సురముని సన్నుతా
ఏకదంతముతో నీవు శోభించి
అర్ధనారీశ్వరునిగ అగుపించి
అద్వైతమును బోధించినావు
అజ్ఞానమును తొలగించినావు
పచ్చి కాయలకే పరవశించి
పచ్చ గడ్డిని పూవును చేసి
ఆ పూవు పూజకే మురిసావు
ముప్పేట వరములు నొసగావు
ఒంకరలన్నీ సవరించావు
సంకటములు తొలగించేవు
శివ జ్ఞానమును కలిగించేవు
శివ భక్తుల కూడి మురిసేవు
దశ బాహువుల మెరిసేవు
దశ దిశలా వ్యాపించేవు
మయూరేశునిగ మసలేవు
కమలాసురుని నిర్జించావు
గణపతి విష్ణువు అభేదము
అవతారములు అందు విశేషము
దర్మ రక్షణే తొలి లక్ష్యం
దుష్ట శిక్షణే పరమార్ధం
ఉపాసనకు ఉన్నతము
ఉపదేశాన నువు ప్రదమం
ఉజ్వలమైనది నీ తేజం
మహోజ్వలమైనది నీ తత్వం
గజముఖమున ఘనతుంది
సూక్ష్మ గ్రాహక శక్తుంది
దేహ కాంతిలో సింధూరం
బ్రహ్మ తేజమునకే ఇది సాధ్యం
అవతారములను దాల్చేవు
అసుర శక్తులను అణిచేవు
నిన్ను తెలియుట ఘన యోగం
కరుణ తపముల సంయోగం
మూషిక వాహన విజయ గణపతి
మోదక హస్త మహా గణపతి
పాశాంకుశముల ప్రదమ గణపతి
పరశు హస్త దర సిద్ది గణపతి
బంధ విమోచక ఊర్ధ్వ గణపతి
భాగ్య ప్రదాత బహుముఖ గణపతి
లక్ష్య ప్రదాతా లక్ష్మీ గణపతి
సిద్ధి ప్రదాతా సిద్ది గణపతి
భక్తి ముక్తి ప్రద బాల గణపతీ
శక్తి యుక్తి ప్రద వీర గణపతి
పాల నేత్ర తేజ దృష్టి గణపతి
నిత్య విఘ్నహర నీల గణపతి
జయ జయ జయ విజయ గణపతి
జయము జయము సుజ్ఞాన గణపతి
జయ జయ జయ క్షిప్ర గణపతి
శరణు శరణు హేరంబ గణపతి
Saavn.com : https://www.saavn.com/label/sri-matha...
1. MusicHouse 27: / musichouse27
2. MyBhaktitv: / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-109674363784497
5. Sri Matha Music Youtube: / @srimathamusic8507
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.