Перейти к содержимому

సింహాచలంలో శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

AVN TELUGU

0:00 / 0:00

సింహాచలంలో శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

45 просмотров · 13 дней назад
AVN TELUGU
1,02 тыс. подписчиков
45 просмотров · 13 дней назад
శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలం కృష్ణాపురం గోశాలలో ఘనంగా గోమాత పూజ శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు సింహాచలం, సెప్టెంబర్ 4, 2026: శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలోని కృష్ణాపురం గోశాలలో శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం గోమాత పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు దంపతులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ వాడ్రేవు రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంతో గోశాల ఆవరణ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. కార్యక్రమంలో భాగంగా అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతను పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ అధికారులు, భక్తులు గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లోకక్షేమం, శాంతి, సౌభాగ్యం, సమృద్ధి కలగాలని ప్రార్థించారు. “గోమాతలో సమస్త దేవతల స్వరూపం ఉందనే విశ్వాసం సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైనది. గోసేవ, గోపూజలు ధార్మిక జీవితంలో పవిత్రమైన భాగం” అని అర్చకులు భక్తులకు వివరించారు. శ్రీకృష్ణుడికి గోపాలకుడిగా, గోసేవకుడిగా ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ గోమాత పూజ నిర్వహించడం శ్రీకృష్ణ జయంతి వేడుకలకు మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు “గోవిందా... గోపాలా...” అంటూ చేసిన నామస్మరణలతో కృష్ణాపురం గోశాల ప్రాంగణం మార్మోగింది. గోమాత పూజలో భక్తులు, ఆలయ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. గోమాత సేవలోనే భగవంతుని సేవను దర్శిస్తూ, శ్రీకృష్ణుని కరుణాకటాక్షాలు సమస్త భక్తులపై ప్రసరించాలని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణ జయంతి పర్వదినం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని దేవస్థానం అధికారులు ఆకాంక్షించారు.