Перейти к содержимому

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ని కైవసం చేసుకున్న టిడిపి పార్టీ

Muthu Mudagandla

0:00 / 0:00

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ని కైవసం చేసుకున్న టిడిపి పార్టీ

32 просмотра · 4 дн. назад
Muthu Mudagandla
40 подписчиков
32 просмотра · 4 дн. назад
‎ ‎ ‎జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో విజేతలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అభినందనలు ‎ ‎ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం కౌంటింగ్ ముగిసే సమయానికి జంగారెడ్డిగూడెం చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి రొంగల అనూష, విజయం సాధించిన వార్డు కౌన్సిలర్లను స్వయంగా కలిసి  హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు