శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం - విశాఖపట్నం జనసేన ఆత్మీయ సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
JanaSena Party
0:00 / 0:00
శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం - విశాఖపట్నం జనసేన ఆత్మీయ సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
6 737 просмотров · 22 часа назад
JanaSena Party
2 млн подписчиков
6 737 просмотров · 22 часа назад
శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం
స్థానిక సమస్యలు తీర్చే నేర్పు, నైపుణ్యం నాయకుడికి ఉండాలి
అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుంది
అధినేత దారిలో నడవండి
సోషల్ మీడియాలో అనవసర అపోహలకు, ప్రచారాలకు తావు ఇవ్వొద్దు
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకమైనవి
కూటమి స్ఫూర్తిని నిలబెట్టేలా బాధ్యతగా, గౌరవంగా ఉందాం
విశాఖపట్నంలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పూర్తి అవగాహన.. ప్రజలతో మమేకం అనేది చాలా ముఖ్యం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం పార్టీ సిద్ధాంతాలు, విధానాలు సగం ఓట్లను తెచ్చిపెడితే మిగిలిన సగం కచ్చితంగా అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రజా సమస్యల మీద ఉండే అవగాహన, పోరాడే తత్వాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం మెండుగా ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. బలమైన అభ్యర్థులు అంటే నిత్యం ప్రజలతో మమేకమై, పార్టీ పట్ల క్రమశిక్షణతో, ప్రజా సమస్యల తీర్చే నేర్పు నైపుణ్యం కలిగి, ఓర్పుతో రాజకీయాలు చేసేవారు అర్హులు. అన్ని అంశాలను బేరిజు వేసుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల ఖరారు జరిగిన తర్వాత వారి గెలుపు కోసం అంతా ఐక్యంగా కష్టపడదాం. అందరికీ అవకాశాలు ఇవ్వాలి అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మనలో ఒకరికి అవకాశం వస్తే దానిని అందరికీ వచ్చిన అవకాశం గా భావించి కష్టపడాలి. టికెట్ రాగానే గెలిచేసాము అనే భావన వద్దు. ప్రజల్లో బలంగా తిరగండి.. వారి మన్ననలు పొందాలి. ప్రజా సమస్యలను తీర్చే సత్తా ఉండాలి.
గోవిందమ్మ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి
2022లో జనవాణి నిర్వహించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అప్పటి వైసిపి ప్రభుత్వం ఆయనను అడుగడుగునా అడ్డుకుంది. హోటల్ గదిలో నిర్బంధించి అరాచకం సృష్టించింది. అలాంటి సమయంలో విశాఖపట్నం వాసులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచారు. చంటి బిడ్డను పక్కన పెట్టుకొని అర్ధరాత్రి వేళ శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ గది ముందు బీచ్ గోడపై శ్రీమతి గోవిందమ్మ గారు పార్టీ జెండా పట్టుకుని బలంగా నిలబడ్డారు. అలాంటి తెగువ స్ఫూర్తి జనసైనికులు వీర మహిళలకు మాత్రమే సొంతం. గోవిందమ్మ లాంటివారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి వీరత్వం అధ్యక్షుల వారిని కట్టిపడేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేయండి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో తీసుకువచ్చిన మార్పులు, సంస్కరణలను విడమరిచి చెప్పండి. పార్టీ కోసం బలంగా నిలబడండి. అంతిమ నిర్ణయం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేయండి.
ఇప్పటివరకు ఏ సీటు ఖరారు కాలేదు
సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు నమ్మొద్దు. సీట్లు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాలు ఇప్పటివరకు ఖరారు కాలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిస్థాయిలో నివేదించిన తర్వాత అధినేతలు సీట్లు గురించి చర్చిస్తారు. సమయం చాలా తక్కువగా ఉంది. మరో రెండు, మూడు విడతల్లో ఎన్డీఏ పార్టీల నాయకులు సమావేశమై ప్రాథమిక సమాచారం ఆధారంగా నివేదికలను అధినేతల దృష్టికి తీసుకువెళ్తాం. దాని తర్వాత మాత్రమే సీట్ల ఖరారు గురించి చర్చలు ఉంటాయి. పోటీ చేసే ప్రతి చోట గెలవాలి. బాధ్యతగా ఉండి కూటమి స్ఫూర్తి కి అనుగుణంగా పని చేద్దాం. జనసేనలో పవన్ కళ్యాణ్ గారి వర్గం ఒకటే ఉంటుంది. జనసేన అభ్యర్థులు నిలబడిన చోట ఎంత ఐక్యంగా నిలబడతామో ఎన్డీఏ పక్షాల అభ్యర్థులు నిలబడిన చోట అంతే ఐక్యంగా పనిచేయాలి" అన్నారు.
Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
/ pawankalyan
/ pawankalyan
https://www.x.com/PawanKalyan
Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan #DeputyCM