జగన్ కంచుకోటలో TDP విక్టరీ | పులివెందులలో వైఎస్ కుటుంబానికి భారీ షాక్ |Pulivendula Results|ABP Desam
ABP Desam
0:00 / 0:00
జగన్ కంచుకోటలో TDP విక్టరీ | పులివెందులలో వైఎస్ కుటుంబానికి భారీ షాక్ |Pulivendula Results|ABP Desam
3 797 просмотров · 1 дн. назад
ABP Desam
791 тыс. подписчиков
3 797 просмотров · 1 дн. назад
#Pulivendula #YSJagan #TDP #YSFamily #GeethaKumari #YSRCP #PulivendulaResults #APPolitics #AndhraPradeshNews #MunicipalElections #ABPTeluguNews #ABPDesam #TeluguNews
వైఎస్సార్ కడప జిల్లాలోని రాజకీయ మహావృక్షం, వైఎస్ కుటుంబానికి తిరుగులేని కంచుకోట అయిన పులివెందుల నియోజకవర్గంలో ఊహించని సంచలనం నమోదు అయింది. దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతున్న పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసింది. టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గీతా కుమారి .. వైసీపీ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై 13వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
గతంలో వైఎస్సార్, ఆయన కుటుంబ సభ్యులు ప్రతిపాదించిన అభ్యర్థులే పులివెందులలో ఎదురులేకుండా గెలుపొందుతూ వచ్చేవారు. పులివెందుల పురపాలక సంఘంగా మారిన తర్వాత కానీ, స్థానిక సంస్థల చరిత్రలో కానీ వైఎస్ కుటుంబ మద్దతు లేని ఇతర ప్రతిపక్ష పార్టీ ప్రజామోదంతో స్థానిక పీఠాన్ని దక్కించుకోవడం అత్యంత అరుదైన ఉదంతం. కాంగ్రెస్ హయాం నుంచి మొదలుకొని వైఎస్సార్సీపీ ఆవిర్భావం వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల ఆదేశమే అక్కడ వేదవాక్కుగా నడిచింది. అయితే కాలక్రమేణా మారుతున్న రాజకీయ సమీకరణాలు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల్లో తమ్ముళ్ల జోరు పెరగడంతో ఈ కోటకు గండిపడింది.
స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం, ఏజెంట్లను అనుమతించలేదనే ఆరోపణలు, రీపోలింగ్ డిమాండ్ల నడుమ ఫలితం ఈ విధంగా రావడం పార్టీ క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీసే అంశంగా మారింది. సొంత నియోజకవర్గంపై పట్టు సడలుతోందన్న సంకేతాలు రావడంతో భవిష్యత్ రాజకీయాల్లో వైఎస్ జగన్ తన కంచుకోటను ఎలా కాపాడుకుంటారనేది ఆసక్తికరంగా మారింది!
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam