Перейти к содержимому

Nannu Pilachina Deva(నన్ను పిలచిన దేవా) - Ranjith Ophir

Nicky Talks

0:00 / 0:00

Nannu Pilachina Deva(నన్ను పిలచిన దేవా) - Ranjith Ophir

52 683 просмотра · 9 лет назад
Nicky Talks
359 подписчиков
52 683 просмотра · 9 лет назад
పల్లవి: నను పిలచిన దేవా! స్తోత్రము! నను మలచిన తండ్రీ! స్తోత్రము నిను కొలిచెదను కొనియాడెదను - నీ మహిమనుపాడెదను నీ కృపలను చాటెదను 1. లోకము నుండి బయటకు నను కృపతో నడిపించితివి నాలో దాగిన ఇహలోకమును తొలగించగ బూనితివి నను శుద్ధునిజేయగ దేవాగ్నిగ నా శిరమున వ్రాలితివి నను జ్వాలగ జేసితివి ॥నను॥ 2. పాపులో ప్రథముడనగు నను ఇల నీతిగ తీర్చితివి పరిశుద్ధులగు నీ ప్రజలకు నను మాదిరిగను నిలిపితివి నీ ఘనమగు పనిలో నిలుపగ నను నీ కోవెల జేసితివి నా కోటగ నిలిచితివి ॥నను॥ 3. శక్తికి మించిన పోరును సలుపగ ఇలనను రేపితివి నా వైరిమూకలకు మించిన బలమును నాకిల నొసగితివి విజయోత్సవంబుతో ప్రతిచోటను నను ఊరేగించితివి నను ధన్యుని జేసితివి ॥నను॥ 4. నీవెవరో నేనెరుగక యుండిన తరినను పిలిచితివి నను నేను సహా ఎరుగక యుండినను బిరుదుల నిచ్చితివి యేసయ్యా కరుణా జలధీ! నీ సరిదైవము లేడయ్యా నా దైవము నీవయ్యా ॥నను॥