Maa Aavidato Pelliki Comic Radio Play I మా ఆవిడతో పెళ్ళికి హాస్య నాటిక by Nanduri Subbarao
Jagruthi telugu tv
0:00 / 0:00
Maa Aavidato Pelliki Comic Radio Play I మా ఆవిడతో పెళ్ళికి హాస్య నాటిక by Nanduri Subbarao
36 379 просмотров · 3 г. назад
Jagruthi telugu tv
2,31 тыс. подписчиков
36 379 просмотров · 3 г. назад
This too is a funny 15 minute playlet broadcast by All India Radio. Maa Aavidato Pelliki means, Going to marriage function with My Wife. A middle class man gets invitation about his Brother in Law's marriage in Hyderabad. He starts with his Wife and a small Child in a Bus from Vijayawada to Hyderabad. The funny conversation of wife and husband preparing to go to the marriage and more funnier incidents during the journey are worth listening. It is not like a play but like a Cinema as the AIR artists made out the play in a such wonderful way.
ఎవరైనా సరే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ చిన్న పిల్లలతో కలిసి హఠాత్తుగా పెళ్ళికి బయలుదేరి వెళ్ళవలిసి రావటం, ఆ హడావిడి, బస్సులో రాత్రిపూట పడి ప్రయాణం చెయ్యటం అనుభవించే ఉంటారు. అదే ఈ హాస్య నాటికలో నండూరి సుబ్బారావు గారు, ఎం నాగరత్నమ్మగారు అద్భుతంగా వినిపించారు, వినిపిపుస్తూ చూపించారు. చక్కటి బాక్‌గ్రౌండ్ శబ్దాలతో, బస్సులో వెళ్తున్న అనుభూతి కల్పించి, మనం సినిమా చూస్తున్నామా అన్నంత భ్రమ అప్పటి ఆకాశవాణి విజయవాడ కళాకారులు, అప్పటికి వాళ్ళకు ఉన్న సాంకేతిమ పరిజ్ఞానంతో అద్భుతంగా ఈ నాటికను రికార్డు చేశారు . బావమరిది పెళ్ళికి ఒక మధ్యతరగతి గృహస్తుకు హఠాత్తుగా ఆహ్వానం వస్తుంది. ఇక చూసుకోండి హడావిడి, ఆయన, ఆయన భార్య ఈ విషయంలో మాట్లాడుకోవటం, ఎకసెక్కాలు ఆడుకోవటం, మంచి సరదాగా ఉంటుంది. బయలుదేరుతున్న బస్సును ఆపి ఎలాగోలాగు ఈ దంపతులు బస్సెక్కుతారు, చివర సీట్లల్లో కూచుంటారు. ఇక అక్కడనుంచి పక్క ప్రయాణికుడితో మాటలు, ఆ మాటల్లో పిల్లవాడు లేచి ఏడవటం, చివరకు హైదరాబాదు వెళ్ళేప్పటికి, పెళ్ళి వాయిదాపడినట్టు తెలియటం, వీళ్ళ సామాను మారుపడిపోయి, పక్కనే కూచున్న సినిమా ఫైట్ మాస్టర్ సామాను వీళ్ళకు రావటం వంటివి జరిగి పాపం ఆ గృహస్తు హైరానా పడిపోతాడు.