Перейти к содержимому

ప్రభుత్వంవెంటనే స్పందించి గీతాకార్మికులపెన్షన్ ఇవ్వాలనిడిమాండ్ ప్రధానకార్యదర్శి పంజాలశ్రీనివాస్ గౌడ్

A5 News

0:00 / 0:00

ప్రభుత్వంవెంటనే స్పందించి గీతాకార్మికులపెన్షన్ ఇవ్వాలనిడిమాండ్ ప్రధానకార్యదర్శి పంజాలశ్రీనివాస్ గౌడ్

168 просмотров · 2 нед. назад
A5 News
161 подписчик
168 просмотров · 2 нед. назад
వెల్కమ్ టు A5 న్యూస్ ఎంపీ డీవో కార్యాలయంలో గీతా కార్మికుల ధర్నా కార్యక్రమం.... యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గీతా కార్మికులకు ధర్నా నిర్వహించారు దరఖాస్తు చేసుకున్న గీత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలి*......*బోలగానీ జయరాములు*.*కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు"* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో అర్హులైన గీత కార్మికులు కొత్త గా 37,411 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగానీ జయరాములు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ముందు కల్లుగీత కార్మిక సంఘం బీబీనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గీత కార్మికుల ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికుల సంక్షేమానికి అనేక రకాల వాగ్దానాలు ఇచ్చిందని అట్టి వాగ్దానాలలో గీత కార్మికుల పెన్షన్ 4000 రూపాయలకు పెంచుతామని. కొత్తగా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగిందని ఇప్పటివరకు అట్టి 4000 రూపాయలు గీత కార్మికులకు అందించలేదని ఇప్పటికైనా అందించాలని అదేవిధంగా నూతన ఆసరా పెన్షన్ లో గీత కార్మికులు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎలాంటి షరతులు వర్తింప చేయకుండా గీత కార్మికుల పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఈ షరతుల వల్ల గీత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి షరతులు లేకుండా దరఖాస్తు చేసుకున్న గీత కార్మికులందరికీ కల్లుగీత కార్మికుల పెన్షన్ మంజూరు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ .యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ కోరుచున్నదని తెలిపారు. అదేవిధంగా వృత్తిలో ప్రమాద నివారణకు ప్రభుత్వం ఇస్తున్న కాటమయ్య రక్షణ కవచం ఇప్పటివరకు రాష్ట్రంలో 30 వేల మందికి మన జిల్లాలో 1800 మంది గీత కార్మికులకు మాత్రమే ఇచ్చారని వృత్తి చేసే వారందరికీ ఇవ్వాలని అన్నారు.ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు ఇస్తామని, వృత్తిలో ఆధునీకరణ పద్ధతులు తీసుకువస్తామని బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన దానిని ఆచరణలో అమలు చేసి చూపాలన్నారు. చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, నందనములోని నీరా తాటి ఈత ఉత్పత్తుల ప్రాజెక్టు వెంటనే ప్రారంభించాలని, పెన్షన్ 4వేలు, ఎక్సిగ్రేషియా పది లక్షలకు పెంచాలని, అన్నారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమం బీబీనగర్ మండల కల్లు గీత పారిశ్రామిక, సహకార సంఘం కమిటీ అధ్యక్షులు చెరుకు బాల్రాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల బిక్షపతి. మండల గౌరవ అధ్యక్షులు కొంతం లింగయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి తంతెనపల్లి రమేష్ గౌడ్, పంజాల సత్యనారాయణ గౌడ్, వరిగంటి శ్యామ్ గౌడ్, బాల మల్లేష్ గౌడ్ సుధాకర్ గౌడ్ బాలకృష్ణ గౌడ్ పంజాబ్ రమేష్ గౌడ్, రంగ గోపాల్ గౌడ్ మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాల కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.