Chengu Chenguna Gantulu Veyandi - Nammina Bantu
VK TV
0:00 / 0:00
Chengu Chenguna Gantulu Veyandi - Nammina Bantu
1 501 031 просмотр · 16 лет назад
VK TV
5,88 тыс. подписчиков
1 501 031 просмотр · 16 лет назад
నమ్మిన బంటు మాయాబజార్ వచ్చిన రెండేళ్లకి... అంటే 1959 లో వచ్చిన మంచి సినిమా. ఈ సినిమా నెగిటివ్సే పోయాయని అన్నారు. మన అదృష్టం కొద్దీ దొరికాయి. ఈమధ్యే వీసీడీ రిలీజయింది. గుమ్మడి దగ్గర ఎస్వీఆర్ పని చేస్తూ ఉంటాడు. ఎస్వీఆర్ కూతురు సావిత్రి చచ్చిపోయే స్థితిలో ఉన్న ఆవుదూడని గుమ్మడి నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే జాలిపడి సావిత్రి తెచ్చి మందువేసి బతికిస్తుంది. ఇంట్లో ఉండే ఇంకో దూడతో కలిసి ఆ దూడ కూడా జతగా పెరుగుతుంది. చివరికి పోటీల్లో గెలుస్తాయి. అప్పుడు గుమ్మడి ఆ దూడ తనదేనంటాడు.
ఆ తువ్వాయిల్ని పెంచేటప్పుడు పాడే పాట ఇది... ఫీల్ కోసం ముందు ఒక నిమిషం సీన్ చేర్చా.
చెంగుచెంగున గంతులు వేయండి... జాతివన్నె బుజ్జాయిల్లారా నోరులేని తువ్వాయిల్లారా..
తెలుగు తల్లికి ముద్దుబిడ్డలు.. సంపద పెంచే జాతిరత్నములు... మా ఇలవేల్పులు మీరు లేనిదే మానవజాతికి బతుకే లేదు... అన్న వాక్యాలు అద్భుతం.