నిన్నే నమ్మితినయ్యా | నేనితరము యెరుగును గురుదేవా | gavinolla ramreddy
Shiva Reddy
0:00 / 0:00
నిన్నే నమ్మితినయ్యా | నేనితరము యెరుగును గురుదేవా | gavinolla ramreddy
17 546 просмотров · 1 год назад
Shiva Reddy
38,9 тыс. подписчиков
17 546 просмотров · 1 год назад
1 తత్వము
రచయిత: శ్రీ సత్యానంద ముకుందయ్యా, తిర్మలపురం.
1. పోదాముపదవే | కృష్ణులగొలువా । పోదముపదవే । పోదముపదవమ్మ ప్రొద్దుబోవగసాగే । ఆదీపర బ్రహ్మముయౌ అమలానందులాజేరా
||పోదము||
2. సారములేనీ సం। సారవార్థిలోబడియు । దారీగానగలేక | దండీ యోచనలాయే
||పోదము||
3. నిత్యానిత్యములాను | నిర్మలంబుగ దెల్పు | సత్యస్వరూపునీ | సన్నుతులను సేవింప ॥||పోదము||
4. సాంఖ్యతారకములను । సారామమనస్కములా । యింకా ముద్రలూదెల్పూ | యిలపరమాత్మను జూపు॥పోదము॥
5. రానీపానటిపరమా । రహస్యములు భోదించు । కానీకల్పన జగము | కలయుగములనీ దెల్పు||పోదము||
6. ధరణి అపరెడ్డిపల్లె | ధామకృష్ణార్యులకు । శరణానేముకుందయ్య । శీఘ్రమే ప్రభుజేర||పోదము||
2. తత్వం
రచయిత : శ్రీ నిర్మలనంద గౌనోళ్ళ రాంరెడ్డి రాజయోగి గారు, గ్రా : అప్పిరెడ్డిపల్లి.
1. నిన్నే నమ్మితినయ్యా | నేనితరము యెరుగును గురుదేవా నిన్నే నమ్మితి నన్నుబ్రోవుమా । కన్నతండ్రిరో కరుణ జూడుమా ॥నిన్నే॥
2. త్రివిధమతములో | తిమరముదెలసియు
త్రివిధ త్రివిధములు । త్రివిధము కావని ॥నిన్నే॥
3. నాల్గునాల్గును నాల్గునుగావని
నాల్గిటిలోనే । నటనను దెలిసియు॥నిన్నే॥
4. ఇది ఇదిఇదియు ఇదియుగాదని
నది ఇది అదియు నాదిగాదని ॥నిన్నే॥
5. కర్మలసోడశి | మర్మముదెలిసియు
నిర్మల ద్వాదశి | నిరతము నీవని ॥నిన్నే॥
6. వాసిగ అపరెడ్డిపల్లెలో వెలసిన
దాసదాసరమ దాసవినుతనుత ॥నిన్నే॥