Перейти к содержимому

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత : జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవర్, జిల్లా ఎస్పీ కే.నరసింహ

@NEWS3

0:00 / 0:00

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత : జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవర్, జిల్లా ఎస్పీ కే.నరసింహ

291 просмотр · 1 дн. назад
@NEWS3
300 подписчиков
291 просмотр · 1 дн. назад
సూర్యాపేట జిల్లా పోలీస్... సూర్యాపేట టౌన్.. 15/10/2026 రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. రోడ్డు నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం.... సూర్యాపేట జిల్లా కలక్టర్, ఎస్పి. జిల్లాలోని 45 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు. హెచ్చరిక బోర్డులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ గార్లు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని అంజనాపురి చౌరస్తా వద్ద రోడ్డు ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్నందలాల్ పవర్ గారు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నివారణ లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ నర్సింహ ఆధ్వర్యంలో అనేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాలను అరికట్టడానికి మరియు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. ఎస్పీ గారి నాయకత్వంలో పోలీస్ శాఖ చేపడుతున్న రహదారి భద్రతా కార్యక్రమాలను విశేషంగా అభినందించారు. నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న సుమారు 45 కంటే ఎక్కువ "బ్లాక్ స్పాట్స్" (ప్రమాదకర ప్రాంతాలు) లొకేషన్లను పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా గుర్తించింది. వాహనదారులు ఈ ప్రాంతాల గుండా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూసేందుకు అక్కడ ప్రత్యేకమైన ట్రాఫిక్ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా ఈ బోర్డులపై రేడియం స్టిక్కర్లతో కూడిన ముఖ్యమైన వివరాలను రూపొందించారు. వాహనదారులు మరియు ప్రయాణికులు రహదారులపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ గారు కోరారు. ముఖ్యంగా వేగ పరిమితిని దాటకుండా జాగ్రత్త వహించాలని, తమ ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రమాదాలు ఎదురైతే వెంటనే సహాయం పొందేందుకు 112 నంబర్‌ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే పోలీస్ మరియు అత్యవసర సేవలు లభిస్తాయి. అంతేకాకుండా, ప్రమాదం జరిగిన స్థలంలోనే తక్షణ సహాయం కోసం సంబంధిత స్థానిక అధికారుల ఫోన్ నంబర్లను కూడా ఈ హెచ్చరిక బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించారు అన్నారు. ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు మాట్లాడుతూ...సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక హెచ్చరిక బోర్డులను (Caution Boards) ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ హెచ్చరిక బోర్డులను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని జాతీయ రహదారులలో ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశముందో (బ్లాక్ స్పాట్స్) అటువంటి 45 ప్రాంతాలను గుర్తించాము. ప్రతి బ్లాక్ స్పాట్‌కు ఇరువైపులా 100 మీటర్ల పరిధిలో రోడ్డు వినియోగదారుల క్షేమం కోసం ప్రతి స్పాట్ వద్ద రెండు బోర్డుల చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సమయంలో రహదారులపై ప్రజల రాకపోకలు, వాహనాల రద్దీ పెద్ద ఎత్తున ఉంటుంది. ప్రయాణికులు హెచ్చరిక బోర్డులను గమనిస్తూ ప్రమాదకర ప్రాంతాలలో వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి అన్నారు వాహనదారులు డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులను పాటిస్తూ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలి. "అరైవ్ అలైవ్" (సురక్షితంగా గమ్యం చేరుకోవడం) అనే లక్ష్యంతో నెమ్మదిగా ప్రయాణించి, తమను తాము కాపాడుకుంటూ ఇతరులను కూడా ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఎస్పీ గారు మీడియా ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.