Bhagawan Sri Venkayya Swami Chalisa #Golagamudi #GuruMaharaj #TrendingVideo
Guru Maharaj
0:00 / 0:00
Bhagawan Sri Venkayya Swami Chalisa #Golagamudi #GuruMaharaj #TrendingVideo
10 203 просмотра · 1 мес. назад
Guru Maharaj
12,6 тыс. подписчиков
10 203 просмотра · 1 мес. назад
🙏 ఓం శ్రీ వెంయ్య స్వామి నమః 🙏
అవధూత శ్రీ వెంయ్య స్వామి వారి దివ్యమైన మరియు భక్తిభరితమైన "భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చాలీసా"ను శ్రవణం చేసి స్వామి కృపకు పాత్రులుకండి. ఈ పవిత్రమైన చాలీసాను నిత్యం పఠించడం లేదా వినడం ద్వారా మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభించడంతోపాటు జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి.
మరిన్ని భక్తి గీతాలు, నామ సంకీర్తనలు మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి!
సమాచారం & వివరాలు:
🎵 పాట: భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చాలీసా
📿 దైవం: అవధూత శ్రీ వెంకయ్య స్వామి (గొలగమూడి)
📝 రచయిత: డా.సాయి శ్రీనివాస్
🎤 స్వరకల్పన. గానం: శ్రీమతి శ్రీవాణి
🎼 సంగీతం: చంద్ర లేఖ
🎥 AI వీడియో ఎడిటింగ్: రాజేష్ ఎడగుట్టు
📜 శ్రీ వెంకయ్య స్వామి చాలీసా సాహిత్యం (Lyrics):
!!ఓం నారాయణ ఆది నారాయణ!!
!!భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి చాలీసా !!
పల్లవి :
శ్రీ వెంకయ్య స్వామి శుభ చరితం
పవిత్రమైన ఈ గానం
అద్భుతమైన ఆనందం
శ్రవణం చేసిన పావనము
చరణము 1
సోంపల్లి వారి వంశము లో
నాగుల వెల్లటూరు వేదిక గా
అవతారము ను తీసుకుని
అందరి దైవము అయ్యావు
చరణం 2
అక్షర విద్య ను వదిలేసి
కుటుంబ బాధ్యత చేపట్టి
ఆదర్శ కూలి గా మారావు
అందరి మన్ననలు పొందావు
చరణం 3
కుల వివక్షత లు పాటించే
కుల పెద్దలను ఎదిరించి
పేదల పాలిట పెన్నిధి వై న
పిచ్చి వెంకయ్య గా పిలిచారు
చరణం 4
చాకలి యోగం మంగలి యోగం
యోగం యోగం అంటూనే
యోగం లేని కులా లకు
యోగ దాయ కుడవయ్యావు
!!శ్రీ వెంకయ్య స్వామి శుభ చరితం!!
చరణం 5
పెంచల కోనకు వెళ్ళావు
కణ్వ మహర్షి ని కలిసావు
సిద్దులు ఎన్నో పొందావు
కారణ జన్ముడవయ్యావు
చరణం 6
యోగి గ నువ్వు మారావు
వేషం బాషా మార్చావు
అగ్ని హోత్రుడై వచ్చావు
మహిమలు ఎన్నో చేసావు
చరణం 7
పేదలు అంటే మమకారం
రైతులు అంటే అభిమానం
అన్నదానమే ప్రీతి కరం
మీ బోధలే మాకు ఆదర్శం
చరణం 8
మూగజీవులను మురిపెము గా
ప్రీతి తో వాటి ని చూసుకుని
తగ్గని జబ్బులు తగ్గించి
వైద్య నారాయణు డయ్యావు
!!శ్రీ వెంకయ్య స్వామి శుభ చరితం!!
చరణం 9
పారే నీటి లో నడుచు కొని
పశువులను చేరుకొని
వ్యాధి తో అరిచే జీవులకు
ప్రాణ దానం చేసావు
చరణం 10
జాడ తెలియని పశువులను
క్షేమం గా దరి చేర్చావు
దిక్కు తోచని రైతులకు
నీవే దిక్కు గా మారావు
చరణం 11
చలమానాయుని కలుపుకొని
కాశీ యాత్రలు చేసావు
వింత గంటలు మ్రోగించి
విశ్వ వ్యాప్తుడవు అయ్యావు
చరణం 12
కోటి తీర్థమును చేరుకొని
అగ్ని గుండము వెలిగించి
పల్లెలు ఎన్నో తిరిగావు
పాడి పంటలు పెంచావు
!!శ్రీ వెంకయ్య స్వామి శుభ చరితం!!
చరణం 13
మాయ జ్వరాలు జబ్బులతో
బాధ లు పడే రోగులకు
దారము తో పోగొట్టి
ధైర్యాన్నే నింపావు
చరణం 14
సంసారం లో సతమతమవుతు
సమస్యలతో బాధలు పడుతు
నిన్ను చేరిన భక్తులకు
అభయ ముద్రల చీటీతొ అభయాన్నే ఇచ్చావు
చరణం 15
భూత ప్రేతాలను పోగొట్టి
జంతు బలులను ఆపించి
నారాయణ భజనలు చేయించి
ఆది నారాయణుడయ్యావు
చరణం 16
రెప్ప పాటు కాలములో
రెండు రైళ్లను ఆపావు
పెద్ద ప్రమాదం తప్పించి
పై వాడి లీల గా చెప్పావు
!!శ్రీ వెంకయ్య స్వామి శుభ చరితం!!
చరణం 17
త్యాగం చేసి తులసవ్వ
భక్తుల ఆకలి తీర్చింది
భగవంతుని గా సేవించి
మీ లో ఐక్యం అయింది
చరణం 18
నిరంతరం నిను సేవించి
నిస్వార్థం తో భజియించి
భక్తి తో కొలిచిన వక్కెమ్మ కు
ముక్తి ని బదులు గా ఇచ్చావు
చరణం 19
గొలగమూడి ని చేరుకొని
గుండమేసుకుని కూర్చొని
సూక్తులు ఎన్నో చెప్పావు
సద్గురు వై వెలిశావు
చరణం 20
ఓం నారాయణ ఆది నారాయణ
నామాన్నే పలికించి
భక్తుల కర్మలు తొలగించి
భగవంతుడ వె అయ్యావు
!!శ్రీ వెంకయ్య స్వామి శుభ చరితం!!
!!ఓం నారాయణ ఆది నారాయణ!!
🌸శ్రీ వెంకయ్య స్వామి చాలీసా వినడం వల్ల కలిగే లాభాలు:🌸
సద్గురువు యొక్క దివ్య రక్షణ మరియు ఆశీస్సులు లభిస్తాయి.
మనశ్శాంతి మరియు ఏకాగ్రత కలుగుతుంది.
ఇంటా బయటా సానుకూల మరియు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.
#VenkayyaSwami #SriVenkayyaSwami #VenkaiahSwamy #Golagamudi #DevotionalSongs #TeluguDevotional #Chalisa #BhaktiSongs #SpiritualChants