Перейти к содержимому

మరియమాత స్తోత్ర గీతం - మాగ్నిఫికాత్

Divine Connect

0:00 / 0:00

మరియమాత స్తోత్ర గీతం - మాగ్నిఫికాత్

165 просмотров · 11 дн. назад
Divine Connect
1,91 тыс. подписчиков
165 просмотров · 11 дн. назад
మరియమాత స్తోత్ర గీతం - మాగ్నిఫికాత్ సాహిత్యం: ఫాదర్ పూదోట దాసయ్య పల్లవి నా ఆత్మ ప్రభువునే పొగడెను నా హృదయం రక్షకునే కొనియాడెను దీన దాసిపై దయ చూపిన దేవుని నా జీవితకాలమంతా ఘనపరచెదను! నా ఆత్మ ప్రభువునే పొగడెను నా హృదయం రక్షకునే కొనియాడెను దీన దాసిపై దయ చూపిన దేవుని నా జీవితకాలమంతా ఘనపరచెదను! దీన దాసిపై దయ చూపిన దేవుని నా జీవితకాలమంతా ఘనపరచెదను! చరణం 1 దీనురాలినై నిలిచిన నన్ను దయామయుడై చూచినాడయ్యా తరతరముల నన్ను ధన్యురాలని లోకమంతయు పలికేలా చేసెను మహత్కార్యములు చేసిన ప్రభువుకే మహిమా ఘనత కలుగుగాక! నా ఆత్మ ప్రభువునే పొగడెను నా హృదయం రక్షకునే కొనియాడెను దీన దాసిపై దయ చూపిన దేవుని నా జీవితకాలమంతా ఘనపరచెదను! చరణం 2 బాహుబలముతో భువిని కదిలించి గర్వపు గుండెలు కరిగించెను సింహాసనములపై ఉన్నవారిని దించి దీనుల చేతిని పైకెత్తెను ఆకలిగొన్నవారిని మేలులతో నింపి ధనికులను ఖాళీగా పంపెను! నా ఆత్మ ప్రభువునే పొగడెను నా హృదయం రక్షకునే కొనియాడెను దీన దాసిపై దయ చూపిన దేవుని నా జీవితకాలమంతా ఘనపరచెదను! చరణం 3 తన కరుణ శాశ్వతముగా నిలిపి ఇశ్రాయేలును ఆదరించెను అబ్రాహాము వంశముకిచ్చిన మాటను తరతరములకు నిలబెట్టెను వాగ్దాన దేవుని విశ్వాస ప్రేమను యుగయుగములకు కొనియాడెదము! నా ఆత్మ ప్రభువునే పొగడెను నా హృదయం రక్షకునే కొనియాడెను దీన దాసిపై దయ చూపిన దేవుని నా జీవితకాలమంతా ఘనపరచెదను! దీన దాసిపై దయ చూపిన దేవుని నా జీవితకాలమంతా ఘనపరచెదను!