మందలించు రామా
parasar_musings 🇮🇳
0:00 / 0:00
మందలించు రామా
2 903 просмотра · 1 дн. назад
parasar_musings 🇮🇳
5,8 тыс. подписчиков
2 903 просмотра · 1 дн. назад
#MandalinchuRama #telugudevotionalsongs #telugumusic #telugubhaktisongs #ramayan #lordrama #sriram #ramabhajan #telugulyrics #teluguindie #TeluguOriginalSong #originalmusic #independentmusicartist #ParasarMusings #parasar_musings #indiandevotionalmusic #devotionalmusic #spiritualmusic #bhaktigeethalu #ramabhakti #telugusongs #telugumusiclovers #selfrealization #AtmaNivedana #soulsearching #indianindiemusic
మందలించు రామా… 🙏
కొన్నిసార్లు మనకు ఓదార్పు అవసరం ఉండదు…
మన తప్పులను ఎత్తిచూపే ఒక స్వరం కావాలి.
లోకానికి మనం మంచివాళ్లమని నిరూపించుకోవడానికి ఎన్నో ముసుగులు వేసుకుంటాం. మనసులోని అసూయను, అహంకారాన్ని, స్వార్థాన్ని, కపటత్వాన్ని మనకే తెలియనట్టు నటిస్తాం.
కష్టమొస్తే దేవుడిని తలుచుకుంటాం…
సుఖం వస్తే ఆయన్నే మర్చిపోతాం.
పక్కవాడి తప్పులను వేలెత్తి చూపిస్తాం…
మన తప్పులను మాత్రం వెయ్యి కారణాలతో కప్పిపుచ్చుకుంటాం.
కానీ ఆ అంతరాత్మ ముందు ఏ ముసుగూ నిలవదు.
ఇది అలాంటి ఒక ఆత్మపరిశీలన.
తనలోని లోపాలను ఒక్కొక్కటిగా గుర్తించి, వాటిని సమర్థించుకోకుండా శ్రీరాముడి ముందు ఒప్పుకుంటున్న ఒక సామాన్యుడి మనోవేదన.
ఇక్కడ భక్తుడు వరాలు అడగడం లేదు.
కష్టాలు తీర్చమని వేడుకోవడం లేదు.
తన తప్పులకు క్షమాపణ కూడా కోరడం లేదు.
తనను తాను సరిదిద్దుకునేలా మందలించమని అడుగుతున్నాడు.
*ఓసారి నన్ను మందలించు రామా…
కాల్చివాత పెట్టి, దండించు రామా…*
ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రేమతో కూడిన ఓదార్పు కంటే, నిజాన్ని గుర్తుచేసే కఠినమైన మందలింపే అవసరం.
ఈ పాట వింటున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం…
*మన తప్పులను ఒప్పుకునే ధైర్యం మనకుందా?*
🎧 Headphones పెట్టుకుని వినండి. ప్రతి పదంలోని భావాన్ని, ప్రతి స్వరంలోని ఆవేదనను అనుభవించండి.
మీ మనసులో ఈ పాట ఏదైనా ఆలోచనను రేకెత్తిస్తే, కామెంట్‌లో పంచుకోండి.
━━━━━━━━━━━━━━━━━━
🎵 CREDITS
━━━━━━━━━━━━━━━━━━
Song Title: మందలించు రామా
English Title: Mandalinchu Rama
Artist / Channel: parasar_musings
Lyrics & Concept: పరాశరా
Music & Vocals: Produced with the assistance of AI tools
Language: Telugu
Genre: Telugu Devotional / Philosophical / Spiritual Indie
Theme: Self-Realization • Repentance • Introspection • Ramabhakti • Humility
━━━━━━━━━━━━━━━━━━
📝 LYRICS
━━━━━━━━━━━━━━━━━━
[Verse 1]
ఓసారి నన్ను మందలించు రామా
ఇంత వాడననచూ
వింత కూతలే కూసి
మైలపడితినయ్యా, మందలించు రామా
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 2]
బుద్దిమంతుడనెడి పగటివేషమేసి
దొంగజపములెన్నో కొల్లలుగజేసి
ఎదుటివానిలోన తప్పులెత్తిజూపి
బొంకినాను నేను నావి గుట్టుగా దాచి
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 3]
కష్టమొచ్చినపుడే నీ కాలికి మొక్కి
సుఖము దక్కినపుడు నిను వెనక్కి నెట్టి
ఆశల ఉచ్చులోన నీతి తప్పిపోయి
అనువుగానివాటికి అర్రులుజాచితి రామా!
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 4]
కంటపడినదంతా కావలించుకోని
కానివెన్నోజేసితి కామమందు నేను
కోర్కెలన్న కొలిమే కళ్ళనంటుకోగా
కానలేక నిజము కాలిపోతి రామా!
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 5]
మంటలెగసే కోపం, మాట తూలిపోయే
మెత్తనైన నాల్క గట్టిమాటలాడే
కంటనీరుగారే గాయమేజేసి
తప్పు నాది కాదని పట్టనట్టుపోతి రామా!
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 6]
ఎంగిలాకు కడిగి దాచుకునే నేను
ఆకలన్నవానికి, మెతుకీయ్యలేదు
ఉన్నదంతా నాకేనని ఉబ్బిపోతూ
డబ్బు వాసనే నాకు ఊపిరైంది రామా
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 7]
ఇంపైన మాటే చెవికోరుకోగా
భజన బృందమోటి నా చుట్టూజేరే
సరిలేరు నీకన్న కూతలనే నమ్మి
భ్రాంతిలో పడిపోయి బందీనైతి రామా
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 8]
నేలమీద కాళ్ళు మోపలేని తత్వం
తలకెక్కిపోయే తగనంత గర్వం
ఎకసెక్కమాడితి ఎదుటివాని కష్టం
తగువాడు లేడని తలెగరేసితి రామా
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Verse 9]
పరుల మేలు చూసి బుద్ధే వంకరైపోగా
వారి నవ్వులే నా కంటిలో నలుసుకాగా
విషము కక్కె బుద్ది, కుళ్ళుకంపులాగా
కుళ్ళి, కుళ్ళి నేను కుళ్ళిపోతి రామా
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
[Outro]
పచ్చి నిజములన్ని నీకప్పజెప్పినాను
లెక్కజూసి నీవు శిక్ష వేయవయ్యా
క్షణమైన ఇకపై నీ పాదములను విడువ
మళ్ళీ మాయ కమ్మకుండా రక్షించవయ్యా
ఓసారి నన్ను మందలించు రామా
కాల్చివాత పెట్టి, దండించు రామా
━━━━━━━━━━━━━━━━━━
📌 COPYRIGHT & USAGE
━━━━━━━━━━━━━━━━━━
© 2026 @parasar_musings
All Rights Reserved.
This is an original lyrical and musical work created for Parasar's Musings, with music and vocals produced with the assistance of AI tools.
Unauthorized reproduction, re-uploading, redistribution, synchronization, commercial use, or reuse of the audio, visuals, artwork, lyrics, or other creative elements without prior written permission is strictly prohibited.