VRK Diet Controversy: వీర'పాచి'నేని డెడ్లీ డైట్.. టైప్-1 డయాబెటిస్ పేషెంట్‌కు ఏం జరిగింది?
The SouthTV
0:00 / 0:00
VRK Diet Controversy: వీర'పాచి'నేని డెడ్లీ డైట్.. టైప్-1 డయాబెటిస్ పేషెంట్‌కు ఏం జరిగింది?
131 просмотр · 6 дн. назад
The SouthTV
3,48 тыс. подписчиков
131 просмотр · 6 дн. назад
VRK Diet Controversy: వీర'పాచి'నేని డెడ్లీ డైట్.. టైప్-1 డయాబెటిస్ పేషెంట్‌కు ఏం జరిగింది? కేసెందుకు పెట్టారు?
#VeeramachineniRamakrishna #VRKDiet #VRKDietCase #VRKHealthcare #Type1Diabetes #Insulin #Diabetes #DKA #HealthNews #HyderabadNews #TelanganaNews #MedicalNews #TeluguNews #TheSouthTV
వీరమాచినేని రామకృష్ణపై కేసు ఎందుకు నమోదైంది? VRK డైట్‌పై ఇప్పుడు ఎందుకింత చర్చ?
టైప్-1 డయాబెటిస్ ఉన్న లా స్టూడెంట్ ఇన్సులిన్ ఆపిన తర్వాత ఆసుపత్రిలో చేరిన ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల లా విద్యార్థి కల్లెడ సాయికృష్ణ తనకు 2018 నుంచి టైప్-1 డయాబెటిస్ ఉందని, ఇన్సులిన్‌పై ఆధారపడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. VRK డైట్‌కు సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత రాయదుర్గంలోని VRK హెల్త్ కేర్ సెంటర్‌ను సంప్రదించినట్లు తెలిపారు.
తన ఫిర్యాదు ప్రకారం, సుమారు ₹26,000 చెల్లించిన తర్వాత ఇన్సులిన్ ఆపేయాలని తనకు సూచించారని ఆయన ఆరోపించారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరగా డయాబెటిక్ కీటో అసిడోసిస్ (DKA), తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ ఫిర్యాదు ఆధారంగా వీరమాచినేని రామకృష్ణ, కోటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. FIRలో మోసం, ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలు, క్రిమినల్ కుట్రతో పాటు సంబంధిత వైద్య/ప్రకటన చట్టాల కింద సెక్షన్లు కూడా ఉన్నట్లు Times of India నివేదించింది.
మరోవైపు, ఆరోగ్య సలహాలను అర్హత కలిగిన వైద్యుల సూచన లేకుండా అనుసరించడంపై కూడా ఈ ఘటన చర్చకు దారితీసింది.
అసలు VRK డైట్ వివాదం ఏంటి?
ఇన్సులిన్ ఆపేయమన్నారనే ఆరోపణల్లో నిజమెంత?
వీరమాచినేనిపై పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు?
ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం.
👍 Like చేయండి
🔁 Share చేయండి
🔔 The South TV Subscribe చేయండి