కళ్యాణదుర్గంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం |Excessive use of plastic in Kalyanadurgam#Ar News
AR NEWS NETWORK
0:00 / 0:00
కళ్యాణదుర్గంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం |Excessive use of plastic in Kalyanadurgam#Ar News
278 просмотров · 3 недели назад
AR NEWS NETWORK
60 подписчиков
278 просмотров · 3 недели назад
కళ్యాణదుర్గంలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం
అధికారుల తనిఖీలు తూతూమంత్రంగానేనా..? ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం అంతంతమాత్రంగానే ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన సమయంలో మాత్రమే మున్సిపల్ అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించి, ఆ తర్వాత పరిస్థితిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాసిరకం ప్లాస్టిక్ కవర్లు పట్టణంలో యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయని, వాటి వినియోగం కూడా విపరీతంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే
పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్ పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా పడేస్తున్న ప్లాస్టిక్ కారణంగా పారిశుధ్య సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని అంటున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు పశువులు తినే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని, దీనివల్ల పర్యావరణంతో పాటు ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత బస్టాండ్ పరిసరాల్లో అధ్వాన పరిస్థితులు
కళ్యాణదుర్గం పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు పందులు, ఆవులు సంచరిస్తుండటం, దోమలు, ఈగల బెడద, దుర్గంధం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
పట్టణ పారిశుధ్యంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చెత్త తొలగింపు, ప్లాస్టిక్ నియంత్రణ, పారిశుధ్య చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మామూళ్ల ఆరోపణలపై అధికారులే సమాధానం చెప్పాలి
నాసిరకం ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని, కొందరు అధికారులు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పట్టణంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా?
ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నాసిరకం ప్లాస్టిక్ విక్రయాలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే దాడులు నిర్వహించడం కాకుండా, నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
మరి ఇప్పటికైనా కళ్యాణదుర్గం మున్సిపల్ అధికారులు స్పందించి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కఠిన చర్యలు చేపడతారా? లేక తనిఖీలు, హెచ్చరికలు తూతూమంత్రంగానే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.
#ar #andhrapradesh #kalyanadurgam #breaking #ananthapuram #latestnews