Перейти к содержимому

కాళ్ళగజ్జి కంకాలమ్మ పాటలో ఉన్న ఆయుర్వేద రహస్యం | Secrets of Ayurveda

Ajagava

0:00 / 0:00

కాళ్ళగజ్జి కంకాలమ్మ పాటలో ఉన్న ఆయుర్వేద రహస్యం | Secrets of Ayurveda

9 831 просмотр · 15 часов назад
Ajagava
191 тыс. подписчиков
9 831 просмотр · 15 часов назад
కాళ్ళగజ్జి - కంకాలమ్మ వేగుచుక్క - వెలగమొగ్గ మొగ్గకాదు - మోదుగనీరు నీరు కాదు - నిమ్మలవాయ - వాయ కాదు - వాయంట కూర కూర గాదు - గుమ్మడిపండు పండు కాదు - పాపడ మీసం మీసం కాదు - మిరియాల పోతు పోతు కాదు - బొమ్మల శెట్టి శెట్టి కాదు - శామలమన్ను మన్ను కాదు - మంచి గంధపు చెక్క లింగులిటుకు - పందెమాల పటుకు కాలు పండినట్లు - కడకుదీసి పెట్టు —-------- ఇదీ ఆయుర్వేద రహస్యం ఉన్న ఓ పాట. ఈ ఆటలో పిల్లలందరనీ వరుసగా కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు ముందుకు చాపిస్తారు. నలుగురు పిల్లలు కూర్చున్నారంటే ఎనిమిది కాళ్ళు వరుసగా ఉంటాయి కదా! అప్పుడు వాళ్ళ కెదురుగా ఒక మనిషి కూర్చుని, ఒక్కో కాలి మీదా లయబద్ధంగా, లెక్కపెడుతున్నట్లుగా కొడుతూ, ఈ గేయాన్ని పాడతారు. అంటే కాళ్ళగజ్జా అని మొదటి కాలి మీద కొడితే, కంకాలమ్మా అని రెండవ కాలి మీద కొడతారు. ఆ తరువాత కాలి మీద వేగుచుక్క, ఆ పై వెలగమొగ్గ ఇలా వరుసగా కొట్టుకుంటూ వెళతారు. ఎనిమిది కాళ్ళ మీద కొట్టేశాక, మరలా మొదటి కాలి దగ్గర నుండి.. పాట మాత్రం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. చివరిలో కడకు తీసి పెట్టు అని అంటూ ఎవరి కాలి మీద కొడతారో, ఆ కాలు పండిపోయినట్లు లెక్క. అప్పుడా పిల్లవాడు, ఆ కాలును మడతపెట్టుకోవాలి. ఆట అలా అన్ని కాళ్ళూ పండిపోయేవరకూ కొనసాగుతుంది. చివరిగా ఏ కాలు మిగులుతుందో ఆ కాలుగల పిల్లవాడే విజేత. ఇదొక సరదా ఆట. పిల్లలు ఈ ఆట ఆడుతూ చాలా సంబర పడిపోయేవారు. వాళ్ళకిందులో ఉన్న ఆయుర్వేద రహస్యంతో పని లేదు కదా! వాళ్ళు ఆ రహస్యాన్ని ఒక తరం నుండి మరొక తరానికి అందించడానికి మాధ్యమాలు అంతే. మరి ఈ గేయంలో ఏ వ్యాధికి మందుంది అంటే.. అది పాట ప్రారంభంలోనే ఉంది. కాళ్ళగజ్జి. అంటే కాళ్ళకు వచ్చే గజ్జికి మందుంది. పూర్వం చాలామంది పిల్లలకు మోకాళ్ళ దగ్గర గజ్జి వచ్చేది. ఆ గజ్జి వల్ల కలిగే దురద, బాధ అంతా ఇంతా కాదు. ఈ పాటలో అలా పిల్లల కాళ్ళకు వచ్చే గజ్జికి మందు ఎలా తయారు చేయాలో, అందుకు ఏమేం పదార్థాలు కావాలో చెప్పబడింది. అయితే ఇందులో చెప్పబడ్డ పదార్థాలలో చాలావరకూ అందరికీ అర్థమయ్యే భాషలో ఉండవు. అప్పట్లో గ్రామల్లోని ఆయుర్వేద వైద్యులకు ఆదిమాంధ్రులు అనే బోయ తెగవారు అడవిలో నుండి కావలసిన మూలికలను తెచ్చి ఇచ్చేవారు. ఆ బోయలు చెట్లను, మూలికలను పిలుచుకునే పేర్లు వేరు. అందుకే ఆ పేర్లు ఆ గ్రామంలోని వైద్యులకు, కొందరు పెద్దలకు తప్ప మిగిలిన వారికి అంతగా తెలిసేవి కావు. ఇక్కడ మరొక్క విషయం. ఈ కాళ్ళగజ్జి కంకాళమ్మా పాటకు ఎన్నో పాఠాంతరాలున్నాయి. కొన్నిచోట్ల కాళ్ళగజ్జ కంకాళమ్మా అని కూడా పాడతారు. అయితే ఏ పాఠంలో అయినా కంకాలమ్మ, వేగుచుక్క, వెలగమొగ్గ మాత్రం కచ్చితంగా ఉంటాయి. కంకాలమ్మ అంటే కచూరాలు, వేగుచుక్క అంటే బావంచాలు, వెలగమొగ్గ అంటే పాదరసం. ఈ మూడే గజ్జిని తగ్గించే ఔషధానికి ప్రధానమైన ముడిసరుకులు. #ayurveda #ancientwisdom #KallaGajji