Manidweepavarnana part1 (మణిద్వీపవర్ణనం శ్రీమద్దేవీభాగవతం,ద్వాదశస్కంధం, దశమోఽధ్యాయం)
Vageeshwari Bhakthi dhara
0:00 / 0:00
Manidweepavarnana part1 (మణిద్వీపవర్ణనం శ్రీమద్దేవీభాగవతం,ద్వాదశస్కంధం, దశమోఽధ్యాయం)
15 866 просмотров · 1 г. назад
Vageeshwari Bhakthi dhara
12,1 тыс. подписчиков
15 866 просмотров · 1 г. назад
దైవానికి ఇన్ని రూపాలెందుకు ? అమ్మవారికి అన్ని నామాలు, రూపాలెందుకు ? అన్నీ ఒక్కరేనా ? అంటే అన్నీ ఒక్కటే, అందరూ ఒక్కరే ! అదే మన సనాతన ధర్మంలోని గొప్పదనం ! మన హిందూమతం లోని మహోత్కృష్టత ! ఈ సమన్వయం మనకు మహర్షులు అడుగడుగునా అందించారు.
ఉన్న ఒక్క పరబ్రహ్మమే సృష్టి చేసేప్పుడు బ్రహ్మగా, రక్షంచేటఫ్ఫుడు విష్ణువుగా, లయకారకుడుగా రుద్రుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
వేదాన్తినోనిర్వచనీయమేక
యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశన్తి
శైవా యమీశం శివ ఇత్యవోచన్
యం వైష్ణవా విష్ణురితి స్తువన్తి
అనిర్వచనీయమైన పరతత్వాన్ని వేదాంతులు బ్రహ్మమంటారు, శైవులు శివుడంటారు, వైష్ణవులు విష్ణువంటారు.
ఆ తత్త్వమే సరస్వతిగా, లక్ష్మిగా, కాళికా ఉన్న త్రిలోక జనని ఆదిపరాశక్తి. అ లోకజనని నివాసస్థానమే మణిద్వీపం,ఈ మణిద్వీపం ఎక్కడ ఉంటుంది ? ఎలా ఉంటుంది ? అక్కడికి వెళ్ళాలి అనుకునే వారు ఏమి సాధన చేయాలి? అనే విషయాలను వ్యాసమహర్షి జనమేజయుడికి దేవి భాగవతం లో వివరించడం జరిగింది! దేవి భాగవతం లోని ద్వాదశస్కంధంలో మణిద్వీపవర్ణనం ఉంది, 283 శ్లోకాలు ఈ వీడియో లో అప్లోడ్ చెయ్యడం జరిగింది! ఈ శ్లోకాలు పారాయణం చేసి అమ్మ అనుగ్రహం పొందండి! దశమోధ్యాయం,ఏకాదశోధ్యాయం,ద్వాదశోధ్యాయం మొత్తం కలిపి 283 శ్లోకాలు ఉన్నాయి వాటిని 3 భాగాలుగా వీడియోలు పెట్టడం జరుగుతుంది,part1 లో దశమోధ్యాయం 100 శ్లోకాలు ఉన్నాయి! శ్రీ గురుదేవుల అనుగ్రహం,అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలి ; అందరు ఆ లోకజనని,మణిద్వీపనివాసిని పాదాలదగ్గర ఉండే భాగ్యం కలగాలని సంకల్పిస్తున్నాం!
#amma #bhajan #dattaguru #bhakti #dattatreya #divine #devational #manidweepavarnana #lordshiva #sgs #shiva #amma #sgs #bhakti #divine #devational #lordshiva #dattatreya #devi bhagawatham #parvati #srimadbhagavatam #manidweepavarnana #lokajanani #lakshmipuja #saraswathipooja #gayatrimantra #lalitha #lalita #bhavana #bhavana #srimatrenamah #jaimatadi #jaimatarani