Sri Sai Baba Divyastuthi || శ్రీ సాయిబాబా చాలీసా || Lord Saibaba Devotionals || Bhakti Taal
Bhakti Taal
0:00 / 0:00
Sri Sai Baba Divyastuthi || శ్రీ సాయిబాబా చాలీసా || Lord Saibaba Devotionals || Bhakti Taal
4 417 просмотров · 4 года назад
Bhakti Taal
69,4 тыс. подписчиков
4 417 просмотров · 4 года назад
Title : Sri Sai Baba Divyastuthi
Lyrics : SREEMAT TIRUMALAGUDIMELLA VENKATA VARADHA RAJU
Composer : Chippada Pavan Kumar
Singer : Vempalli Akhila
#saibababhakthisongs
#saibabadevotionalsongs
#saibabachalisa
Shirdi Sai Devotional Songs
Produced by : B.N.Murthy , P.Nagabhushana Rao
Listen on Itunes:
https://itunes.apple.com/album/id/160...
Listen on Spotify:
https://open.spotify.com/album/0boxsQ...
Listen on deezer:
https://www.deezer.com/album/284598762
Bhakti Taal.
1. ధరణి జనులకు శుభ యోగం
శిరిడి వాసులకు ఘన యోగం
దత్త తేజమే దిగి వచ్చి.
సాయినాథుడై చరియించె. 2
2 .సర్వ దేవతలు ఒక్కటిగా
సాయిగ తెలిసెను ముచ్చటగా
సాయని పిలిచిన వెనువెంట
ఓయని పలికెను గనినంత
3సాంబశివునిలో "సా" కారం
వటపత్ర శాయిలో "యి" కారం
సాయి నాథునిగ తెలిసినది
సాయి రూపమున మెరిసినది
4 శివ కేశవుల అభేదము
శిరిడి సాయిగా ప్రమోదము
శిరిడి చేరుటే శుభ కరము
సాయి సన్నిధే నిజ సుఖము
5శిరిడీ చేరిన సుందరుడు
సర్వము తెలిసిన శుభకరుడు
సకల శాస్త్రముల దినకరుడు
భక్తుల పాలిట భయహరుడు
6అభయములొసగే హరిహరుడు
అవని మాతకు ప్రియ సుతుడు
తెలిసీ తెలియని వారలకు
సద్గురవై తెలిసెను శ్రీ సాయి
7గప్త జ్యోతులను చూపించి
గురు స్థానముగా ప్రకటించి
గురువు మూలమని చాటేవు
గురువుల స్థాయిని తెలిపావు
8ద్వారకమాయి అమ్మ ఒడి
అభయ ప్రదాతకు అది నెలవు
ఆశ్రయమొందగ అది కొలువు
అభయము నొందగ మరి సులువు
9సుందరమైనది ఆ రూపం
ఆనందము కూర్చును తేజం
కామిత ఫలములు అందించె
ఆత్మ స్వరూపుడు శ్రీ సాయి.
.
10నింబ వృక్షమున వసియించి
కల్ప వృక్షమును తలపించి
పకీరు రూపున అగుపించి
పరమ దయాళువై ప్రభవించె
11తిల తత్వమును కలిగించి
జలమున దీపము వెలిగించి
సాయి లీలగా చూపేను
పరమాత్మ తత్వము తెలిపేను
12.చిలుము పీల్చే నెపముంచి
చిమటా నేలను తాకించి
నిప్పు నీరులను రప్పించె
నిర్మల మూర్తిగ అగుపించి
13వేషము చూడ పకీరుగా
వాసము చేసెను మసీదులో.
కామధేనువై నిలిచేను
కల్ప వృక్షమై కాచేను. "ధరణి"
14సర్వమతముల సమ్మతిగ
సాయి తత్వమును ఎరిగించి
సకల జీవులను ప్రేమించె
దయగల సాయి భాసించె. "ధరణి"
15పంచ సూనమను పాపములు
భిక్ష రూపమున గ్రహించి
ఆది భిక్షువును తలపించి
సద్గురువై తెలిసెను శ్రీసాయి. "ధరణి"
16 .బండబారిన గుండెలలో
భగవత్ చింతన కలిగించి
సమతా మమతలు కలిగించి
సాటి మనిషిగా చరియించె. "ధరణి"
17.నోటి మాటతో శాసించి
పంచ భూతముల పాలించి
ప్రళయము కట్టడి చేసేను
సర్వం సాయిగ తెలిసేను. "ధరణి"
18.అగ్న హోత్రమును రగిలించి
ధునిగా దానికి పేరుంచి
ఔషధ గుణములను కలిగించి
భక్తుల రోగము తొలగించె. "ధరణి"
19కాల సర్పము కాటైనా
కాల నాగు విషమైనా
కంఠ ధ్వనితో కడతేర్చె
సర్వాత్ముడుగా ప్రభవించె "ధరణి"
20గతజన్మ వైరాలు గుర్తించి
శేష ఫలమును కాస్త తొలగించి
ఈ జన్మ నాటితో ముగియించి
పరమపదమున నిలిపేను
21నానా కన్నులు తెరిపించి
జగద్గురువుగా అగుపించి
ధునిలో చేయిని జొప్పించి
కమ్మరి బాలుని రక్షించె. "ధరణి"
22మాయ రోగములు మాపేను
దయతో భక్తుల కాచేను
పశు పక్షాదుల సాకేను
ప్రేమతొ పోషణ చేసేను
23చందనోత్సవ శ్రీకారం
శ్రీరామ నవమికి సహకారం
అంబరమంటిన సంతోషం
సాయి చెతనే ఇది సాధ్యం
24సాయి ఒసగిన అభయాలు
ఏకాథశ శుభ సూత్రాలు
బ్రతుకు బాటలో నేస్తాలు
తెలిసిన చాలును వచనాలు
25అపర శివునిగా అవతారం
నారాయణుడిగా నడయాడి
దత్తాత్రేయుడై దరి జేరి
అజుడుగ వేదాలు వివరించె
26.పిండిని జల్లెను పొలి మేర
వ్యాధిని ఆపెను ఆమేర
అభయము నొసగెను అంతటితో
భయములు తొలగెను అందరిలో
27.గ్రంథ పఠనము చేయించి
ఫలశృతి అందున ఎరిగించి
జ్ఞానము తెలియగ జేసేను
జ్ఞాన మూర్తిగా తెలిసేను
28 .కఫినీ వస్త్రమును తొలగించి
అగ్నికి ఆహుతి గావించి
దివ్య దర్శనము నొసగితివి
సీమను వీడుట తెలిపితివి
29.సాయి భగీచా చూపించి
లెండి తోటగా ఎరిగించి
చక్కగ మొక్కలు పెంచేను
పూవును ప్రాణిగ చూసేను
30క్రిమి కీటాదుల భాషించి
ఆత్మ తత్వమును భోదించి
సాయి చేసెను ఉపదేశం
చాటి చెప్పెను మన కోసం
31సహచర జీవన సంపర్కం
శ్రవణానంద సానిధ్యం
కనులకు అందెను నీ తేజం
నిత్య దర్శనం ఒక భాగ్యం
32వరములు నొసగే వరదుడవు
ఆర్తిని తెలిసిన ఆధ్యుడవు
అగణిత గుణగణ నందుడవు
ఆద్యంతముల మెరిసావు
33అందరి దైవం ఒక్కడనీ
నామ రూపములె పెక్కు అని
విభేదాలను విడనాడి
కలసి మెలగుట తెలిపావు
34.చూపు తాకగ చురుకుమని
మాట పలుకగ తళుకుమని
ఎదలో ఏదో మెరిసేను
ఎదలో సాయిగ తెలిసేను
35విభూతులను ఎరిగించావు
అనుభూతులెను పంచావు
ఆనందం చవి చూపావు
అమృత రూపున నిలిచావు
36.భావ రీతిని మెరిసేవు
భాగ్య దాతగా తెలిసేవు
భోగములంటక నిలిచేవు
కర చరణాదుల కదిలేవు
37.కర్మలు చేయగ తెలిపేవు
కర్మ సాక్షిగా నిలిచేవు
మర్మములెన్నో వివరించి
మనసును తెలిసి పలికేవు
38దేహబంధమును తృంచగను
ధరణిని వీడగ మరి తలచి
సూత్ర ప్రాయముగ తెలిపేవు
సమాధి దిశగా సాగేనవు
39 కరచరణాదులిక కాననని
రక్షణ భారము వీడనని
నభయము కూడి మసలమని
అభయము నొసగెను అందరికీ
40రూపము మరుగున దాచేను
అనంత రూపము దాల్చేను
తేజమునంతట నిలిపేను
శీలది శిరిడిగ మారేను
.ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి