ధారా సుధీర్ గారు | ఫ్యాక్షన్ కు తావులేదు | నందికొట్కూరు తెదేపా నేతల హితవు
PadmaTeja News
0:00 / 0:00
ధారా సుధీర్ గారు | ఫ్యాక్షన్ కు తావులేదు | నందికొట్కూరు తెదేపా నేతల హితవు
3 492 просмотра · 4 дн. назад
PadmaTeja News
195 подписчиков
3 492 просмотра · 4 дн. назад
ఎడిటర్ : రామచంద్రుడు
రిపోర్టర్ : లింగమయ్య
అలగనూరు రిజర్వాయర్‌పై మరియు నందికొట్కూరు పట్టణానికి తాగునీటి సమస్యల గురించి అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా..? దారా సుధీర్ గారు
(నందికొట్కూరు నియోజకవర్గం)
దారా సుధీర్ గారు ప్రతిసారి మీరు అలగనూరు రిజర్వాయర్ గురించి నందికొట్కూరు తాగునీటి సమస్యల పైన మాట్లాడుతున్నారు కదా మేము కూడా బహిరంగంగా పటేల్ సెంటర్లో చర్చకు సిద్ధం
ఆ రిజర్వాయర్ గురించి మీ వైసిపి నాయకులను అడగండి ఏం జరిగిందో చెప్తారు దాని గురించి, మొదటగా చాపల పంచాయతీ నుండి మొదలైన యవ్వారం చాపలు దాంట్లో కమిషన్ ఇవ్వలేదని చాపల పట్టనివ్వకుండా మత్స్యకారులను ఆపించినది కూడా మీ నాయకులే మొదటగా దారా సుధీర్ గారు.
తర్వాత అక్కడ ఏం జరిగిందో గాని 500 మీటర్లు బండ్ కూలిపోయింది దారా సుధీర్ గారు గత వైసిపి హయాంలో మీ నాయకుడు దానికి టెండర్ వేపిస్తే ఆ పనిని పూర్తి చేయలేక మధ్యలోనే చేతులెత్తేశారు రివర్స్ టెండర్రింగ్ పేరుతో 3.61 కోట్లతో పోయేది 36 కోట్ల దాకా తెచ్చారు ఈ రోజు దారా సుధీర్ గారు రివర్స్ టెండర్రింగ్ పాలసీ అంటే ఇదేనా దారా సుధీర్ గారు.
తర్వాత 2021లో ₹3.61 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి GO RT No. 70 జారీ అయినప్పటికీ, పనులు పూర్తి చేయలేకపోయింది మీ గత వైసీపీ ప్రభుత్వం. మీ నాయకుడు రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టు పనులను ముందుకు తీసుకెళ్లలేక, చివరకు కాంట్రాక్టర్‌తో పాటు మీ ప్రభుత్వమే ఆ పనులను క్లోజ్ చేసిన విషయం GO RT No. 687లో ఏముందో చదివితే తెలుస్తుంది.
గతంలో మీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై సమాధానం చెప్పకుండా, ఇప్పుడు మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
దమ్ముంటే పటేల్ సెంటర్‌కు రండి! అలగనూరు రిజర్వాయర్ పనులపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పిన చోట, మీరు చెప్పిన సమయంలో చర్చకు రావడానికి మేమూ సిద్ధమే! లేదంటావా మీ నాయకుడు ఇంటికి దగ్గర కూడా చర్చకు సిద్ధమే
2014 నుంచి 2019 వరకు టిడిపి గవర్నమెంట్లో అప్పుడు ఇన్చార్జిగా ఉన్న శ్రీ మాండ్ర శివానందరెడ్డి గారు అమృత స్కీం కింద నందికొట్కూరు తాగు నీటి అవసరాల కోసము అలగనూరు నుంచి పట్టణానికి త్రాగునీరు అందించడానికి 109 కోట్లుతో మంజూ చేయిస్తే వెంటనే అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది కానీ ఇక్కడ ఉన్న మీ లోకల్ నాయకులు నందికొట్కూరు ప్రజలకు త్రాగునీటి ఇష్టంలేక ఆ శిలాఫలకాలు ధ్వంసం చేసిన ఘనత కూడా మీ నాయకులకి మీ పార్టీ వాళ్లకి చెందుతుంది దారా సుధీర్ గారు.
ఇప్పుడు ఏదో నందికొట్కూరు ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లో మెప్పు పొందడానికి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే నమ్మడానికి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా పట్టణ ప్రజలు సిద్ధంగా లేరు దారా సుధీర్ గారు
నువ్వు ఇవన్నీ మాట్లాడవలసింది మా దగ్గర కాదు మీ వెనకాల ఉన్న ఫాక్షన్ నాయకుని దగ్గర మాట్లాడాలా క్లారిటీ తీసుకొని మాట్లాడు స్కిట్ రాసి ఇచ్చినంత మాత్రాన చదివినంత మాత్రాన నువ్వు పెద్ద నాయకుడు లాగా ఫీల్ అయిపోయికు దార సుధీర్ గారు.
నీ వెనక మీ ఫ్యాక్షన్ నాయకుడు ఉన్నాడని మాట్లాడుతున్నారు గతంలో ప్రాతకోట సంబంధించిన నందికొట్కూరు పట్టణంలో బ్రహ్మంగారిమఠం దగ్గర ఒక సంఘటనలో మీ ప్రభుత్వంలోని మీ నాయకుని పైన 307 కేసు పడితే 9 నెలలు నియోజకవర్గంలోనే కనిపించకుండా పోయినాడు తెలుసుకోండి దారా సుధీర్ గారు.
ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆల్రెడీ నందికొట్కూరులో గత మీ వైసిపి ప్రభుత్వంలో ఫ్యాక్షన్ ఎక్కువైనందుకే మా నాయకులు మాండ్ర శివానందరెడ్డిగారు మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఎటువంటి అలజదులు లేకుండా ప్రజలు ప్రశాంతమైన జీవితం సాగిస్తున్నారు.
డాక్టర్ గా మీరు ఒక రోగాన్ని నిర్ధారణ చేయాలంటే ఎన్నో పరీక్షలు చేస్తారు కనీసం మాట్లాడే ముందు నిజం తెలుసుకొని మాట్లాడండి దారా సుధీర్ గారు! అని నాయకులు వివరించడం జరిగినది.