ఆదోని బావాజీపేట లో రేషన్ కోసం ప్రజల అవస్థలు..పేద ప్రజల రేషన్ అమ్ముకుంటున్న డీలర్ @TVnewsAdoni #adoni
9TV news Adoni 9014486864
0:00 / 0:00
ఆదోని బావాజీపేట లో రేషన్ కోసం ప్రజల అవస్థలు..పేద ప్రజల రేషన్ అమ్ముకుంటున్న డీలర్ @TVnewsAdoni #adoni
1 876 просмотров · 9 мес. назад
9TV news Adoni 9014486864
22,3 тыс. подписчиков
1 876 просмотров · 9 мес. назад
బాబుజీ పేటలో పిడిఎస్ రేషన్ షాపు ఏర్పాటు చేయాలి – ప్రజల డిమాండ్
ఆదోని పట్నం పరిధిలోని బాబుజీ పేటలో పిడిఎస్ (రేషన్) బియ్యం షాపు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ బియ్యం తీసుకోవాలంటే వాల్మీకి నగర్ లోని కొండ ప్రాంతానికి వెళ్లాల్సి రావడం వల్ల వృద్ధులు, మహిళలు, పేద కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారు.
ఒక్కసారి రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే ఆటో ఖర్చు సుమారు ₹100 వరకు అవుతోందని, దీంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు షాపుకు వెళ్లినప్పుడు కూడా “బియ్యం లేవు” అని చెప్పడంతో కొనుగోలు చేసి తినాల్సి వస్తోందని తెలిపారు.
ఇంతకుముందు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటికాడే రేషన్ సరఫరా జరిగేదని గుర్తు చేసిన ప్రజలు, ప్రస్తుతం ఆ విధానం లేకపోవడంతో సమస్యలు పెరిగాయని అన్నారు. ఓట్లు అడగడానికి మాత్రమే నాయకులు వస్తున్నారని, కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో బాబుజీ పేటలో కొత్తగా పిడిఎస్ రేషన్ బియ్యం షాపును ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.