ప్రజ్ఞానం బ్రహ్మ | Episode - 243 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 12th Sep 2026 | @SathguruTatvam
Sathguru Tatvam
0:00 / 0:00
ప్రజ్ఞానం బ్రహ్మ | Episode - 243 సూఫీవేదాంతదర్శము_అంతర్జాల సదస్సు | 12th Sep 2026 | @SathguruTatvam
967 просмотров · 2 дня назад
Sathguru Tatvam
15,4 тыс. подписчиков
967 просмотров · 2 дня назад
షష్ఠ పీఠాథిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంతదర్శమే “#ప్రజ్ఞానంబ్రహ్మ”
#PragnanamBrahma #sufivedantadarsamu
Author: Kavisekhara Dr.Umar Alisha, 6th Head of the institution
"ప్రజ్ఞానం బ్రహ్మ" ఎపిసోడ్ - 243
వక్తలు :
1. శ్రీమతి దంతులూరి సుశీల, రాజమండ్రి
2. శ్రీ యర్రంశెట్టి శివన్నారాయణ, బల్లిపాడు
ఓం శ్రీ సద్గురుభ్యో నమః
సూఫీ వేదాంతదర్శము
496 వ పద్యము
శా. ఆధారాదిక చక్రషట్కమున సోహంనాదపాఠంబు వి
ద్యాధుర్యంబుగ పాడనేర్చునెడ బ్రహ్మాండంబు రూపించు నా
నాధిక్కార తమోనివృంతవిగళన్నాదంబు పోకార్చి జ్ఞా
నాధిక్యంబగు తేజ మేర్పడును బ్రహ్మానందవారాశియై.
497 వ పద్యము
శా. హంసన్ బైకి మరల్చు నా తెరవు సంధ్యావ్యాహృతుల్ దోఁచఁ బ్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్ దర్కించు తల్లక్షణో
త్తంసంబైన నుపాధితేజమున ప్రత్యగ్లీనమై కుండలిం
హింసన్ బాపి సుషుమ్నలో వెలుఁగు నూహించున్ గళాలోకమై.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము షష్ఠ పీఠాధిపతులు డా.ఉమర్ ఆలీషా వారు #తత్త్వవేత్త . వీరు రచించిన #సూఫీవేదాంతదర్శము గొప్ప తత్త్వసంహిత. పాఠకుల హృదయంలో మరో #భగవద్గీత రూపంలో చిరస్థాయిగా నిలిచిన ఉద్గ్రంథం. పరమాత్మ స్వరూపమును అంతటా చూడడం కోసం వివిధ సాధనామార్గాలను ఈ గ్రంథం ద్వారా తెలియజేశారు. తన మోక్షము తన చేతుల్లోనే ఉంది, దాన్ని సులువుగా అందేలా చేయడమే ఈ గ్రంథం యొక్క ముఖ్యాశయము. ఈ సృష్టిలో ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే వివేకాన్ని కలిగించి మనస్సుకు స్థిరత్వాన్ని కలుగజేస్తుంది ఈ గ్రంథము.
ప్రస్తుత ఆధునిక జీవన విధానాన్ని గడుపుతున్న మనందరికీ ఈ పద్యాలు చక్కని మార్గనిర్దేశకాలు. ఆనందకరమైన తాత్త్వికజీవనాన్ని గడిపే విధంగా మనలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం సాయంత్రం 7 గం.లకు సూఫీవేదాంతదర్శము పద్యాలను సులువుగా అర్ధం చేసుకొనే విధముగా #ప్రజ్ఞానంబ్రహ్మ అనే ఈ సదస్సును సద్గురువర్యుల దివ్యాశీస్సులతో నిర్వహించుకుంటున్నాము.
SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM
Dr.Umar Alisha, 9th head of the institution.
Pithapuram, Andhra Pradesh, INDIA
---------------------------------------------------------------------------------------
More information at the following websites,
http://www.sriviswaviznanspiritual.org
http://www.uardt.org
---------------------------------------------------------------------------------------
Official Social Profiles :
Facebook :
/ svvvap1472
/ uardt
/ drumaralisha
Instagram :
/ svvvap1472
/ uardt2000
/ drumaralisha
Twitter :
/ svvvap1472
https://x.com/uardt2000
/ drumaralisha
Sathguru Tatvam - Youtube Video Channel
/ sathgurutatvam
/ @uardt